బాలిక అపహరణపై సుమోటో కేసు
ABN , First Publish Date - 2023-07-06T03:09:13+05:30 IST
ప్రకాశం జిల్లా ఒంగోలులో బాలిక అపహరణ ఘటనపై మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఈ కేసును సుమోటోగా తీసుకొని నిందితుడు ఎస్.కె.ఖలీల్‌తో పాటు 13మంది ఉన్నతాధికారులకు
సీరియస్‌గా తీసుకున్న మానవ హక్కుల కమిషన్
ఒంగోలు(క్రైం), జూలై 5: ప్రకాశం జిల్లా ఒంగోలులో బాలిక అపహరణ ఘటనపై మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఈ కేసును సుమోటోగా తీసుకొని నిందితుడు ఎస్.కె.ఖలీల్‌తో పాటు 13మంది ఉన్నతాధికారులకు నోటీసులు జారీచేసింది. ఈ నెల 24లోపు నివేదికలు అందజేయాలని కోరింది. ఒంగోలులోని బిలాల్‌నగర్‌కు చెందిన 14 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన ఖలీల్ ఆమెను తన ఇంట్లో బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. 15రోజులు నరకం చూపించాడు. ఈ వ్యవహారంపై ‘స్పందించని పోలీస్.. బాలికకు 15 రోజుల నరకం!’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ 3న కథనం ప్రచురించింది. స్పందించిన హెచ్‌ఆర్సీ ఒంగోలు తాలుకా పోలీసు స్టేషన్ హౌస్ ఆఫీసర్, సర్కిల్ ఇన్‌స్పెక్టర్, దిశ స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఒంగోలు డీఎస్పీ, ప్రకాశం ఎస్పీ, కలెక్టర్, గుంటూరు రేంజి ఐజీ, డీజీపీ, ప్రిన్సిపల్ సెక్రటరీ (హోం), ప్రకాశం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ, ఆ శాఖ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ వుమెన్ అండ్ చైల్డ్, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీకి నోటీసులు జారీచేసింది.