MLC election: దోచుకున్న సొమ్మును పెట్టుబడులుగా మార్చుకునేందుకే సమ్మిట్‌: బుద్దా వెంకన్న

ABN , First Publish Date - 2023-03-09T21:37:37+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి (Chief Minister Jagan Mohan Reddy) గడచిన నాలుగేళ్ల పాలనలో రాష్ట్రంలో దోచుకున్న సొమ్మును పెట్టుబడులుగా మార్చేందుకే

 MLC election: దోచుకున్న సొమ్మును పెట్టుబడులుగా మార్చుకునేందుకే సమ్మిట్‌: బుద్దా వెంకన్న

విశాఖపట్నం: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి (Chief Minister Jagan Mohan Reddy) గడచిన నాలుగేళ్ల పాలనలో రాష్ట్రంలో దోచుకున్న సొమ్మును పెట్టుబడులుగా మార్చేందుకే విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌ (Global Investor Summit) నిర్వహించారని టీడీపీ నేత బుద్దా వెంకన్న (Budda Venkanna) ఆరోపించారు. అది గ్లోబల్‌ సమ్మిట్‌ (Global Summit) కాదని...జె(జగన్‌) సమ్మిట్‌ అని విమర్శించారు. సీఎం హోదాలో అనేక రకాలుగా కూడబెట్టిన సొమ్మును వైట్‌గా మార్చి పెట్టుబడుల రూపంలోకి తీసుకువచ్చేందుకు పారిశ్రామిక సదస్సు ఏర్పాటుచేశారని విమర్శించారు. ఇందుకు సూట్‌కేసు కంపెనీలు ఏర్పాటుచేసి వాటితో ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఆరోపించారు. విశాఖతోపాటు ఇతర ప్రాంతాల్లో బెదిరించి, బలవంతంగా లాక్కున్న భూములను సొంతం చేసుకునేందుకు పరిశ్రమల డ్రామా ఆడుతున్నారన్నారు. ఇప్పటికే విశాఖలో వేల కోట్ల రూపాయల విలువైన భూములను దోచుకున్న జగన్‌ అండ్‌ కో... పరిశ్రమల ఏర్పాటుతో మిగిలిన భూముల కబ్జాకు ప్రయత్నాలు ముమ్మరం చేసిందని బుద్దా వెంకన్న ఆరోపించారు.

జగన్‌కు గుణపాఠం చెప్పడానికి ఈనెల 13న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC election) ఉత్తరాంధ్రలో పట్టభద్రులంతా టీడీపీ అభ్యర్థి (TDP candidate)కి మొదటి ప్రాధాన్య ఓటు వేయాలని వెంకన్న కోరారు. ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థికి ఓటు వేయాలంటూ ఉపాధ్యాయులు, ఉద్యోగులను వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నాయకుల బెదిరింపులకు భయపడాల్సిన పనిలేదన్నారు. గత ఏడాది జనవరిలో ‘ఛలో విజయవాడ’ను విజయవంతం చేసినట్టుగా 13వ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీని ఓడించాలని బుద్దా వెంకన్న పిలుపునిచ్చారు.

Updated Date - 2023-03-09T21:37:37+05:30 IST