అభినవ దుర్యోధనుడిలా చెలరేగుతున్న జగన్‌: పీతల సుజాత

ABN , First Publish Date - 2023-09-18T02:20:06+05:30 IST

సాక్ష్యాధారాలు లేకుండా ఏకంగా అరెస్ట్‌ చేసేసి, తర్వాత ఎఫ్‌ఐఆర్‌లో పేరు నమోదు చేసే విధానం ఏపీలోనే కనిపిస్తోందని మాజీ మంత్రి పీతల సుజాత వ్యాఖ్యానించారు. ఆదివారం టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.

అభినవ దుర్యోధనుడిలా   చెలరేగుతున్న జగన్‌: పీతల సుజాత

అమరావతి, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): సాక్ష్యాధారాలు లేకుండా ఏకంగా అరెస్ట్‌ చేసేసి, తర్వాత ఎఫ్‌ఐఆర్‌లో పేరు నమోదు చేసే విధానం ఏపీలోనే కనిపిస్తోందని మాజీ మంత్రి పీతల సుజాత వ్యాఖ్యానించారు. ఆదివారం టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘స్కిల్‌ డెవల్‌పమెంట్‌లో నిధుల దుర్వినియోగంపై అభియోగాలు వస్తే విచారణ చేయాలి కానీ చంద్రబాబును అరెస్ట్‌ చేయడమేంటీ? వైసీపీకి ఓటమి భయంతోనే చంద్రబాబును టార్గెట్‌ చేసింది. రాష్ట్రంలో జరిగే నేరాలు, ఘోరాలకు జగన్‌ సపోర్టు ఉంది. జగన్‌ అభినవ దుర్యోధనుడిలా చెలరేగిపోతున్నాడు. ఆయనకు రూ.లక్షల కోట్ల అధికార, అనధికార ఆస్తులున్నాయి. పక్క రాష్ట్రం మద్దతు, బ్లూ మీడియా సపోర్టు ఉన్నా... తాను ఒంటరిని అనడం ప్రజల్ని మోసం చేయడమే. 2004లో కేవలం రూ.కోటి 73 లక్షల ఆస్తి ఉన్న జగన్‌రెడ్డి ఇప్పుడు రూ.లక్షల కోట్లకు అధిపతి ఎలా అయ్యారో ప్రజలు ఆలోచించాలి’’ అని సుజాత విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2023-09-18T02:20:06+05:30 IST