Share News

మాపై కేసు కొట్టేయండి

ABN , Publish Date - Dec 31 , 2023 | 03:31 AM

పులివెందుల పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టి వేయాలని కోరుతూ దివంగత వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

మాపై కేసు కొట్టేయండి

హైకోర్టును ఆశ్రయించిన వివేకా కుమార్తె, అల్లుడు

అమరావతి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): పులివెందుల పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టి వేయాలని కోరుతూ దివంగత వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కేసులో తదుపరి చర్యలను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించారు. హైకోర్టు పీపీ, ఎం వెంకటకృష్ణారెడ్డిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చారు. పులివెందుల ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ ఈ నెల 8న జారీ చేసిన ఉత్తర్వుల ఆధారంగా నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరారు.

Updated Date - Dec 31 , 2023 | 03:32 AM