నాసా ఐఎస్‌డీసీ కాన్ఫెరెన్స్ 2023లో శ్రీచైతన్య స్కూల్ ప్రభంజనం
ABN , First Publish Date - 2023-06-11T03:41:39+05:30 IST
అమెరికాలోని డల్లాస్‌లో మే 22 నుంచి జూన్ 4 వరకు జరిగిన నాసా ఐఎస్‌డీసీ కాన్ఫెరెన్స్‌కు శ్రీచైతన్య స్కూల్ విద్యార్థులు 101 మంది హాజరయ్యారని శ్రీచైతన్య స్కూల్ అకడమిక్ డైరక్టర్ సీమ తెలిపారు.
హైదరాబాద్, జూన్ 10(ఆంధ్రజ్యోతి): అమెరికాలోని డల్లాస్‌లో మే 22 నుంచి జూన్ 4 వరకు జరిగిన నాసా ఐఎస్‌డీసీ కాన్ఫెరెన్స్‌కు శ్రీచైతన్య స్కూల్ విద్యార్థులు 101 మంది హాజరయ్యారని శ్రీచైతన్య స్కూల్ అకడమిక్ డైరక్టర్ సీమ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఈ కాన్ఫెరెన్స్‌కు 225 మంది విద్యార్థులు హాజరవ్వగా.. భారత్ నుంచి హాజరైన 105 మందిలో 101 మంది(96 శాతం) విద్యార్థులు శ్రీచైతన్య విద్యార్థులేనని వివరించారు. నాసాతో సంయుక్తంగా ఎన్‌ఎస్‌ఎస్‌నిర్వహించిన ఈ స్పేస్ సెటిల్‌మెంట్ కాంటెస్ట్‌లో శ్రీచైతన్య స్కూల్ 54 ప్రాజెక్టులు గెలుపొందిందని ఆమె వెల్లడించారు. వరుసగా పదో సంవత్సరం ప్రపంచ ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు శ్రీచైతన్య స్కూల్ గెలుచుకుందని చెప్పారు. ఆర్టిస్టిక్ మెరిట్ విభాగంలో 500 అమెరికన్ డాలర్ల నగదు బహుమతి పొందిన ప్రపంచంలోనే ఏకైక విద్యార్థి శ్రీచైతన్యకు స్కూల్ విద్యార్థి అని, అలాగే స్పేస్ పాలసీ అండ్ యూనివర్సలైజేషన్ డిబేట్ పోటీలో ప్రథమస్థానం పొందింది కూడా శ్రీచైతన్య విద్యార్థేనని డైరెక్టర్ సీమ తెలిపారు.