వైసీపీలో నిద్రలేని రాత్రులు గడిపా
ABN , Publish Date - Dec 29 , 2023 | 03:36 AM
వైసీపీలో ఎదురైన అవమానాలు, ఇబ్బందులతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. నా జీవితంలో ఇన్ని అవమానాలు ఎప్పుడూ పడలేదు. నాకు ఎదురవుతున్న ఇబ్బందులు,
ఇన్ని అవమానాలు ఎప్పుడూ పడలేదు
సీఎం జగన్‌కు ఎమ్మెల్సీ వంశీకృష్ణ లేఖ
విశాఖపట్నం, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): ‘వైసీపీలో ఎదురైన అవమానాలు, ఇబ్బందులతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. నా జీవితంలో ఇన్ని అవమానాలు ఎప్పుడూ పడలేదు. నాకు ఎదురవుతున్న ఇబ్బందులు, అన్యాయాలను మీకు చెప్పుకోవాలని ఏడాదిన్నరగా ప్రయత్నించాను. కానీ మీరు అవకాశం ఇవ్వలేదు. ఆత్మాభిమానం లేనిచోట మనసు చంపుకుని ఉండలేను. అందుకే పార్టీని వీడుతున్నాను’ అంటూ వైసీపీని వీడి ఈనెల 27న జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణశ్రీనివాస్ సీఎం జగన్మోహన్‌రెడ్డికి లేఖ రాశారు. ఈ లేఖను గురువారం మీడియాకు విడుదల చేశారు. అందులో తనకు ఎదురైన అవమానాలు, ఇబ్బందులు, వ్యాపారం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టి భార్య అనారోగ్యం పాలవ్వడం వంటి అంశాలను విపులంగా పేర్కొన్నారు.