పాస్‌పోర్టులకు స్పెషల్‌ డ్రైవ్‌

ABN , First Publish Date - 2023-04-26T04:35:41+05:30 IST

పాస్‌పోర్టులకు మళ్లీ భారీ డిమాండ్‌ ఏర్పడింది. కరోనాకు ముందు పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకుంటే రెండు రోజుల్లోనే స్లాట్‌ దొరికేది.

పాస్‌పోర్టులకు స్పెషల్‌ డ్రైవ్‌

ఇకపై ప్రతి శనివారం 2,200 స్లాట్లు విడుదల

విజయవాడ, తిరుపతి కేంద్రాల్లో స్లాట్ల పెంపు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): పాస్‌పోర్టులకు మళ్లీ భారీ డిమాండ్‌ ఏర్పడింది. కరోనాకు ముందు పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకుంటే రెండు రోజుల్లోనే స్లాట్‌ దొరికేది. కరోనా కారణంగా విదేశాలకు రాకపోకలు నిలిచిపోవడంతో చాలాకాలం పాస్‌పోర్టులకు ఎవరూ దరఖాస్తు చేయలేదు. మళ్లీ ఇప్పుడు దరఖాస్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీంతో 30 నుంచి 40 రోజుల తర్వాత స్లాట్‌ వస్తోంది. ఈ డిమాండ్‌ను తగ్గించేందుకు విదేశాంగ శాఖ ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇకపై ప్రతి శనివారం పాస్‌పోర్టు సేవా కేంద్రాలు (పీఎ్‌సకే) పనిచేస్తాయి. ఆరోజున రాష్ట్రవ్యాప్తంగా 2,200 కొత్త స్లాట్లు విడుదల చేస్తారు. కొత్తవారితోపాటు ఇప్పటికే దరఖాస్తు చేసుకొని, ఎక్కువ రోజుల గ్యాప్‌తో స్లాట్‌ వచ్చిన వారు రీషెడ్యూల్‌ చేసుకోవచ్చని విశాఖపట్నం ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం అధికారిణి విశ్వంజలి గైక్వాడ్‌ తెలిపారు. ఇదికాకుండా సోమవారం నుంచి శుక్రవారం వరకు రెగ్యులర్‌గా ఇచ్చే స్లాట్లతో పాటు విజయవాడ పీఎ్‌సకేలో 50, తిరుపతి పీఎ్‌సకేలో 100 స్లాట్లు అదనంగా ఇవ్వనున్నామని చెప్పారు. తత్కాల్‌ కింద దరఖాస్తు చేసుకునేవారు పాస్‌పోర్టు పోర్టల్‌లో సూచించిన సర్టిఫికెట్లు తీసుకొని రావాలని, రీషెడ్యూలింగ్‌కు అవకాశం లేకుండా తత్కాల్‌ని ఉపయోగించుకోవాలని ఆమె సూచించారు.

Updated Date - 2023-04-26T04:35:41+05:30 IST