Share News

Sidiri Appalaraju: ఒక పీకే ఉన్నాడు.. మరో పీకే చేరాడు.. అంతే..

ABN , Publish Date - Dec 26 , 2023 | 01:45 PM

పెదజాలారిపేటలో సునామీ రోజు సందర్భంగా మత్స్యకారులు గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగమ్మకు పసుపు కుంకుమ సమర్పించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రూపాల, రాష్ట్ర మంత్రి అప్పలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అప్పలరాజు మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ, పీకే కలయికను వైసీపీ పట్టించుకో వడం లేదన్నారు.

Sidiri Appalaraju: ఒక పీకే ఉన్నాడు.. మరో పీకే చేరాడు.. అంతే..

విశాఖపట్నం: పెదజాలారిపేటలో సునామీ రోజు సందర్భంగా మత్స్యకారులు గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగమ్మకు పసుపు కుంకుమ సమర్పించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రూపాల, రాష్ట్ర మంత్రి అప్పలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అప్పలరాజు మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ, పీకే కలయికను వైసీపీ పట్టించుకో వడం లేదన్నారు. ఇప్పటికే ఒక పీకే అక్కడ ఉన్నాడని... ఇప్పుడు మరో పీకే చేరాడని.. అంతకు మించి ఎటువంటి ప్రభావం ఉండబోదన్నారు.

మాపై భయంతోనే పీకేని కలిశారని సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. ఎన్నికలు అయిన తర్వాత టీడీపీలో జనసేన కలిసిపోవచ్చన్నారు. రానున్న ఎన్నికల్లో విజయం సాధించడానికే వైసీపీ చిన్న చిన్న మార్పులు జరుగుతున్నాయన్నారు. పవన్ కల్యాణ్ తాను పోటీ చేసే నియోజకవర్గం మార్చుకుంటే తప్పు లేదు కానీ... తాము కో ఆర్డినేటర్‌లను మార్చుకుంటే భయపడినట్టా అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రపై ప్రతిపక్ష పార్టీలు కాక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయన్నారు. అనుకున్న సమయానికి సీఎం వైజాగ్ నుంచి పాలన సాగిస్తారని అప్పలరాజు పేర్కొన్నారు.

Updated Date - Dec 26 , 2023 | 01:45 PM