Siddharth Luthra : చంద్రబాబును కలిసిన సిద్ధార్థ్‌ లూథ్రా

ABN , First Publish Date - 2023-09-14T04:02:23+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తరఫున కోర్టులో వాదనలు వినిపిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా బుధవారం రాజమండ్రి జైలు లో ఆయనను కలిశారు. అనంతరం లోకేశ్‌తో భేటీ

Siddharth Luthra : చంద్రబాబును కలిసిన సిద్ధార్థ్‌ లూథ్రా

రాజమహేంద్రవరం (ఆంధ్రజ్యోతి)/రాజమహేంద్రవరం అర్బన్‌, సెప్టెంబరు 13: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తరఫున కోర్టులో వాదనలు వినిపిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా బుధవారం రాజమండ్రి జైలు లో ఆయనను కలిశారు. అనంతరం లోకేశ్‌తో భేటీ అయ్యారు. రాజమహేంద్రవరానికి చేరుకున్న వెంటనే లూథ్రా సిటీలో లోకేశ్‌ బస చేస్తున్న నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. సాయంత్రం 3.45 గంటలకు సెంట్రల్‌ జైలు వద్దకు వచ్చారు. అయితే నాలుగు గంటలకు ములాఖత్‌ ఖరారు కావడంతో 15 నిమిషాలపాటు వేచిచూశారు. నాలుగు గంటలకు లోపలకు వెళ్లి చంద్రబాబును కలిసి 4.30 గంటల సమయంలో బయటికి వచ్చారు. మీడియాతో మాట్లాడతారని అందరూ భావించినా, కారు ఎక్కి ఆయన వెళ్లిపోయారు.

‘కత్తి తీసి యుద్ధం చేయడమే...’: సిద్ధార్థ లూథ్రా

విజయవాడ, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ‘అన్నివిధాలా ప్రయత్నించినా, న్యాయం కనుచూపు మేరలో లేదని తెలిసినపుడు కత్తి తీసి యుద్ధం చేయడమే సరైంది’’ అని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా బుధవారం ట్వీట్‌ చేశారు. సిక్కుల మత గురువు గురుగోవింగ్‌ సింగ్‌ సూక్తిని ఉటంకిస్తూ ఆయన చేసిన ఈ ట్వీట్‌ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. సిద్ధార్థ లూథ్రా ప్రస్తుతం చంద్రబాబు కేసును వాదిస్తున్న సంగతి తెలిసిందే.

Updated Date - 2023-09-14T04:02:23+05:30 IST