CM Jagan: ఎమ్మిగనూరులో వైసీపీకి షాక్
ABN , Publish Date - Dec 29 , 2023 | 05:32 PM
ఎమ్మిగనూరులో వైఎస్సార్‌సీపీకి షాక్ తగిలింది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా చెన్న కేశవరెడ్డి అవకాశం ఇవ్వకపోతే వైసీపీ పార్టీ సభ్యత్వానికి, తమ పదవులకు రాజీనామా చేస్తామని బెదిరించారు.
కర్నూలు: ఎమ్మిగనూరులో వైఎస్సార్‌సీపీకి షాక్ తగిలింది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా చెన్న కేశవరెడ్డి అవకాశం ఇవ్వకపోతే వైసీపీ పార్టీ సభ్యత్వానికి, తమ పదవులకు రాజీనామా చేస్తామని బెదిరించారు. వయోభారం అనే కారణం చూపి ఎమ్మెల్యే చెన్న కేశవ రెడ్డికి జగన్ టికెట్ ఇవ్వనని చెప్పడం దారుణమని వారు మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మిగనూరు నుంచి వైసీపీ తరుపున బుట్టా రేణుక, రుద్ర గౌడ్, సంజీవ్ కుమార్ ఎవరు పోటీ చేసినా గెలవరని ఈ సందర్భంగా కాంగ్రెస్ అధిష్ఠానాన్ని హెచ్చరించారు. తమ అభిప్రాయాలను పట్టించుకోకుండా ఎమ్మెల్యే కేశవరెడ్డికి కాకుండా వేరే వారికి టికెట్ ఇస్తే తాము ఓటు వెయ్యబోమని ఎంపీటీసీలు, సర్పంచ్‌లు తేల్చిచెప్పారు.