ఆమెకు 13... అతనికి 34
ABN , First Publish Date - 2023-03-25T03:06:04+05:30 IST
కూతురు వయస్సున్న బాలికను ఓ వ్యక్తి పెళ్లి చేసుకున్న ఘటన నంద్యాల జిల్లా కోవెలకుంట్ల పట్టణంలో శుక్రవారం చోటు చేసుకుంది.

బాలికతో రహస్య వివాహం.. ముగ్గురిపై కేసు
కోవెలకుంట్ల, మార్చి 24: కూతురు వయస్సున్న బాలికను ఓ వ్యక్తి పెళ్లి చేసుకున్న ఘటన నంద్యాల జిల్లా కోవెలకుంట్ల పట్టణంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు... కోవెలకుంట్లకు చెందిన ఓ బాలిక ఆరో తరగతి చదువుతోంది. తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా తునిపల్లె మండలం కమ్‌కోల్ గ్రామానికి చెందిన 34 ఏళ్ల మంగలి సాయిబాబ డ్రైవింగ్ నిమిత్తం కోవెలకుంట్లకు వచ్చేవాడు. పాఠశాలకు వెళ్లే బాలికకు మాయమాటలు చెప్పి వలలో వేసుకున్నాడు. ఈ నెల 23న బాలికను అహోబిలం తీసుకెళ్లి వివాహం చేసుకున్నాడు. ఈ విషయం ఐసీడీఎస్ సూపర్‌వైజర్ శుక్రవారం గీతాలక్ష్మికి తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సాయిబాబతో పాటు అతనికి సహకరించిన రామలక్ష్మి, నూర్‌బాషాష అనేవారిపైౖ కూడా కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మౌళాని తెలిపారు.