సీనియర్ పాత్రికేయుడు సుధాకర్‌రావు హఠాన్మరణం
ABN , First Publish Date - 2023-11-30T03:55:12+05:30 IST
‘ఆంధ్రజ్యోతి’ నెల్లూరు యూనిట్‌లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్న ఎంవీ.సుధాకర్‌రావు మంగళవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. విజయవాడకు
నెల్లూరు, నవంబరు 29: ‘ఆంధ్రజ్యోతి’ నెల్లూరు యూనిట్‌లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్న ఎంవీ.సుధాకర్‌రావు మంగళవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. విజయవాడకు చెందిన ఆయన విద్యాభ్యాసం పూర్తయ్యాక 1990లో ‘ఆంధ్రజ్యోతి’లో చేరారు. ఎక్కువ కాలం తిరుపతిలో ఆయన పని చేశారు. ‘ఆంధ్రజ్యోతి’ పునఃప్రారంభం నుంచి నెల్లూరు యూనిట్ కార్యాలయంలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి సుధాకర్‌కు గుండెపోటు రాగా ఆసుపత్రికి తరలించేలోపే మార్గమధ్యంలో మృతి చెందారు. విషయం తెలుసుకుని పాత్రికేయులు బుధవారం నెల్లూరు కల్లూరుపల్లి హౌసింగ్‌బోర్డు కాలనీలోని ఆయన నివాసానికి చేరుకుని నివాళులర్పించారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి ఎ.జయప్రకాష్, జిల్లా అధ్యక్షుడు వల్లూరు వెంకటేశ్వర్లు తదితరులు శ్రద్ధాంజలి ఘటించారు. సాయంత్రం బోడిగాడితోటలో సుధాకర్‌రావు అంత్యక్రియలు జరిగాయి. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.