27,406 పాఠశాలల్లో ‘సీస్’ సర్వే
ABN , First Publish Date - 2023-11-04T03:51:27+05:30 IST
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను అంచనా వేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 27,406 పాఠశాలల్లో శుక్రవారం స్టేట్ ఎడ్యుకేషనల్ అచీవ్‌మెంట్ సర్వే (సీస్) పరీక్ష నిర్వహించారు.
అమరావతి, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను అంచనా వేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 27,406 పాఠశాలల్లో శుక్రవారం స్టేట్ ఎడ్యుకేషనల్ అచీవ్‌మెంట్ సర్వే (సీస్) పరీక్ష నిర్వహించారు. ఆయా పాఠశాలల్లో 3, 6, 9 తరగతుల విద్యార్థులు మొత్తం 7,06,934 మందికి ఈ పరీక్ష నిర్వహించడానికి ఎన్‌సీఈఆర్‌టీ ఫరక్ నేతృత్వంలో ఏర్పాట్లు చేశారు. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ గుంటూరు జిల్లా మందడం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో సర్వే నిర్వహణ తీరును పరిశీలించారు. సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు విజయవాడ నగరంలో పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు.