‘సాగర’ తీరంలో సీ స్నేక్
ABN , First Publish Date - 2023-11-30T03:33:14+05:30 IST
మత్స్యకారుల వలకు విషపూరితమైన సీ స్నేక్ చిక్కింది. సాగర్‌నగర్ సమీపంలోని జోడుగుళ్లపాలెం
సాగర్‌నగర్ (విశాఖపట్నం), నవంబరు 29: మత్స్యకారుల వలకు విషపూరితమైన సీ స్నేక్ చిక్కింది. సాగర్‌నగర్ సమీపంలోని జోడుగుళ్లపాలెం తీరంలో మత్స్యకారులు బుధవారం చేపల కోసం వల వేయగా అందులో చిన్న చేపలతో పాటు సీ స్నేక్ చిక్కుకుంది. వల బయటకు లాగిన తరువాత దానిని గమనించిన మత్స్యకారులు అది విషపూరితమైన పాముగా గుర్తించి, తిరిగి సముద్రంలోకి విడిచిపెట్టారు.