ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలు చేయాలి
ABN , Publish Date - Dec 31 , 2023 | 12:11 AM
జిల్లాలో ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, కేసులకు సంబంధించిన బాధితులకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అరుణ్‌బాబు ఆదేశించారు.
పుట్టపర్తి, డిసెంబరు 30: జిల్లాలో ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, కేసులకు సంబంధించిన బాధితులకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అరుణ్‌బాబు ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి విజిలెన్స, మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఎస్సీ,ఎస్టీ గ్రామంలో శ్మశానవాటిక ఉండాలని, ఇందుకు అవసరమైన భూమిని గుర్తించాలని,వారంరోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. జేసీ అభిషేక్ కుమార్, సబ్‌కలెక్టర్ భరత, డీఆర్‌ఓ కొండయ్య, ఎస్సీ వెల్ఫేర్ అధికారి శివరంగప్రసాద్, ఆర్డీవో భాగ్యరేఖ, వంశీకృష్ణ, సురే్‌షరెడ్డి పాల్గొన్నారు.
తండాల్లో మౌలిక వసతులు కల్పించాలి
జిల్లాలోని నిగిరిజన తండాల్లో మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ అరుణ్‌బాబు అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో గిరిజన సంక్షేమ సంఘం ఆధ ్వర్యంలో బంజార సేవా సంఘం ఇచ్చిన వినతులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ తండాల్లో సురక్షితమైన తాగునీరు, వీఽధి దీపాలు, మౌలిక వసతులు కల్పించాలన్నారు.
మ్యానివల్ స్కావెంజర్స్ పూర్తిగా నిషేధించాలి
జిల్లాలో మ్యానివల్ స్కావెంజర్స్ (పాకీపనులు) నిషేధించాలని కలెక్టర్ అరుణ్‌బాబు ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మ్యానివల్ స్కావెంజర్స్ చట్టం 2013 నియామాలపై కమిటీ సభ్యులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎక్కడ చట్ట ఉల్లంఘన జరగడానికి వీలు లేదని, అలా ఎవరైనా ఉల్లంఘిస్తే సెక్షన 8 ప్రకారం రెండు సంవత్సరాలు జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా, రెండూ విఽధించే అవకాశముందమదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని పూర్తి నిషేధించాయని, అధికారులు అమలు చేయాలని సూచించారు.