ఏపీలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 దుర్వినియోగం
ABN , First Publish Date - 2023-09-18T02:19:16+05:30 IST
ఏపీలో పోలీసుల అధికార దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపి, చట్టపరమైన చర్యలు తీసుకోండి. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరె్‌స్టను నిరసిస్తూ రోడ్లపైకి వస్తున్న ప్రజలు, ప్రజాసంఘాలు, ప్రతిపక్ష పార్టీలను వేధిస్తున్నారు’’ అంటూ టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, కేంద్ర హోం శాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు.

కేంద్ర హోం కార్యదర్శికి సత్యప్రసాద్ లేఖ
అమరావతి, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): ఏపీలో పోలీసుల అధికార దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపి, చట్టపరమైన చర్యలు తీసుకోండి. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరె్‌స్టను నిరసిస్తూ రోడ్లపైకి వస్తున్న ప్రజలు, ప్రజాసంఘాలు, ప్రతిపక్ష పార్టీలను వేధిస్తున్నారు’’ అంటూ టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, కేంద్ర హోం శాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన లేఖ రాశారు. ‘‘బ్రిటిష్ పాలనలో కూడా లేని ఆంక్షలను రాష్ట్రంలో జగన్ సర్కార్ అమలు చేస్తోంది. వైసీపీ నేతలకు వర్తించని 144 సెక్షన్ ప్రతిపక్షాలకు వర్తింపజేస్తున్నారు. 144 సెక్షన్‌ను, పోలీస్ యాక్ట్ 30ని దుర్వినియోగం చేస్తున్నారు. శాంతియుతంగా నిరసనల్లో పాల్గొంటుంటే నోటీసులు ఇస్తున్నారు. అక్రమ అరె్‌స్టలు, అక్రమ నిర్బంధాలు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే. వైసీపీ సభలకు బలవంతంగా విద్యార్థులను తరలిస్తున్న అధికారులు.. చంద్రబాబుకు సంఘీభావం తెలిపితే విద్యార్థులపై 307 వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం, కాలేజీ యాజమాన్యాలను బెదిరించడం ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు నిదర్శనం’’ అని లేఖలో పేర్కొన్నారు.