డీకే చదువుల బాబుకు బాల సాహిత్య పురస్కారం
ABN , First Publish Date - 2023-11-10T04:28:27+05:30 IST
ప్రముఖ రచయిత డీకే చదువుల బాబుకు బాల సాహిత్య పురస్కారాన్ని కేంద్ర సాహిత్య అకాడమి అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ గురువారం ప్రదానం చేశారు.
న్యూఢిల్లీ, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ రచయిత డీకే చదువుల బాబుకు బాల సాహిత్య పురస్కారాన్ని కేంద్ర సాహిత్య అకాడమి అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ గురువారం ప్రదానం చేశారు. చదువుల బాబు రచించిన ‘వజ్రాల వాన’ బాల కథా సంపుటికి అకాడమి పురస్కారాన్ని అందించింది. అవార్డులో భాగంగా పురస్కార గ్రహీతలకు రూ.50వేల నగదుతోపాటు ప్రశంసా పత్రాన్ని బహూకరించారు. చదువుల బాబు సహా.. వివిధ భాషలకు చెందిన రచయితలకు ఇక్కడ త్రివేణిసంగమంలో అవార్డులను ప్రదానం చేశారు. ప్రముఖ రచయిత్రి, ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి కూడా ఈ పురస్కారాన్ని అందుకున్న వారిలో ఉన్నారు.