Share News

బొజ్జల, టీడీపీ నేతలకు హైకోర్టులో ఊరట

ABN , First Publish Date - 2023-11-10T03:52:44+05:30 IST

శ్రీకాళహస్తి నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్‌ బొజ్జల సుధీర్‌ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. సుధీర్‌ రెడ్డితో పాటు మరో 25 మంది టీడీపీ కార్యకర్తల విషయంలో

బొజ్జల, టీడీపీ నేతలకు హైకోర్టులో ఊరట

అమరావతి, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తి నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్‌ బొజ్జల సుధీర్‌ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. సుధీర్‌ రెడ్డితో పాటు మరో 25 మంది టీడీపీ కార్యకర్తల విషయంలో సీఆర్పీసీ సెక్షన్‌ 41(ఏ) నిబంధనల మేరకు నడుచుకోవాలని శ్రీకాళహిస్తి రెండవ పట్టణ పోలీసులను ఆదేశించింది. ఎస్‌సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదైనప్పటికీ, పిటిషనర్‌పై మోపబడిన ఆరోపణలు తీవ్రమైనవి కానందున అర్నేశ్‌ కుమార్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు పాటించాలని పోలీసులకు స్పష్టం చేసింది. ఈమేరకు వ్యాజ్యాన్ని పరిష్కరిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టి.మల్లిఖార్జునరావు గురువారం తీర్పు ఇచ్చారు.

Updated Date - 2023-11-10T03:52:45+05:30 IST