Rammohan Naidu: జగన్ ఆర్ధిక ఉగ్రవాది.. ల్యాండ్, శాండ్ దోచుకున్నారు..
ABN , Publish Date - Dec 29 , 2023 | 01:24 PM
జగన్ ఆర్ధిక ఉగ్రవాది అని ఎంపీ రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. మాయమాటలు చెప్పి జగన్ అధికారంలోకి వచ్చాడన్నారు. 99.5 శాతం హామీలు పూర్తి చేశామని వైసీపీ నాయకులు ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. మీడియా సమావేశం పెట్టడానికి సీఎం భయపడుతున్నాడన్నారు.
శ్రీకాకుళం: జగన్ ఆర్ధిక ఉగ్రవాది అని ఎంపీ రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. మాయమాటలు చెప్పి జగన్ అధికారంలోకి వచ్చాడన్నారు. 99.5 శాతం హామీలు పూర్తి చేశామని వైసీపీ నాయకులు ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. మీడియా సమావేశం పెట్టడానికి సీఎం భయపడుతున్నాడన్నారు. ప్రత్యేక హోదాపై కనీసం ఒక్క ప్రయత్నం చేయలేదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటికరణ చేస్తున్నా ఆపే ప్రయత్నం చేయలేదన్నారు. ల్యాండు శాండు దోచుకున్నారని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
విశాఖపట్నం రాజధానిపేరుతో ఉత్తరాంధ్ర ప్రజలని మోసం చేశారని రామ్మోహన్ నాయుడు అన్నారు. దోచుకోవడం దాచుకోవడమే వైసీపీ పాలసీ అని పేర్కొన్నారు. మద్యపానం నిషేధంపై మాట తప్పారన్నారు. మద్యంపై అప్పులు తెచ్చుకున్న అప్పుల మహారాజు జగన్ అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. మధ్యతరగతి ప్రజలపై ధరల భారం మోపాడన్నారు. జగన్ మోసపూరిత మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నాడన్నారు. అంగన్‌వాడీ వర్కర్లు హామీలు నెరవేర్చలేదన్నారు. అడుదాం ఆంధ్రా అంటూ డబ్బులు దండుకుంటున్నాడని.. ప్రజలు మేల్కోవాలని రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు.