కౌలుగుండెకు వానపోటు!

ABN , First Publish Date - 2023-03-19T02:38:39+05:30 IST

ఆరుగాలం శ్రమకోడ్చి పండించిన పంట వానపాలు అవుతుంటే చూసిన ఆరైతు గుండె ఆగిపోయింది.

కౌలుగుండెకు వానపోటు!

తడుస్తున్న పంటను కాపాడుకోబోయి పొలంలోనే రైతు మృతి

గన్నవరం, మార్చి 18: ఆరుగాలం శ్రమకోడ్చి పండించిన పంట వానపాలు అవుతుంటే చూసిన ఆరైతు గుండె ఆగిపోయింది. ఎన్టీఆర్‌ జిల్లా గన్నవరం ఎస్సీ కాలనీకి చెందిన తిరివీధి ఏసు(63) మర్లపాలెం వద్ద ఎకరంన్నర పొలాన్ని కౌలుకు సాగు చేస్తున్నాడు. అందులో మినుము, పెసర వేశారు. పంటను కోసి కుప్పగా వేయగా ఇంతలో అకాల వర్షం వచ్చింది. పంటను వాననుంచి కాపాడుకునేందుకు పట్టాలు కప్పేందుకు శుక్రవారం సాయంత్రం భార్య మణిమ్మతో కలసి ఏసు పొలంలోకి వెళ్లాడు. పట్టాలు కప్పుతుండగా ఆందోళనతో కుప్పకూలిపోయాడు. అక్కడే పడిపోయిన ఏసును చూసి భార్య మణిమ్మ విలపిస్తూ కేకలు పెట్టింది. చుట్టుపక్కలవారు వచ్చి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

Updated Date - 2023-03-19T02:38:39+05:30 IST