ఏపీలో రాహుల్‌, ప్రియాంక సభలు పెట్టండి

ABN , First Publish Date - 2023-09-18T02:20:54+05:30 IST

స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైజాగ్‌లో రాహుల్‌ గాంధీతోనూ, రాజధానిగా అమరావతిని కొనసాగించాలన్న డిమాండ్‌తో విజయవాడలో ప్రియాంకతోనూ బహిరంగ సభలు పెట్టండి. అలాగే రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కోరుతూ తిరుపతిలో మల్లికార్జున ఖర్గే బహిరంగ సభ ఏర్పాటు చేయాలంటూ ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు విజ్ఞప్తి చేశారు.

ఏపీలో రాహుల్‌, ప్రియాంక సభలు పెట్టండి

మల్లికార్జున ఖర్గేకు గిడుగు లేఖ

అమరావతి, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైజాగ్‌లో రాహుల్‌ గాంధీతోనూ, రాజధానిగా అమరావతిని కొనసాగించాలన్న డిమాండ్‌తో విజయవాడలో ప్రియాంకతోనూ బహిరంగ సభలు పెట్టండి. అలాగే రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కోరుతూ తిరుపతిలో మల్లికార్జున ఖర్గే బహిరంగ సభ ఏర్పాటు చేయాలంటూ ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఏఐసీసీ అధ్యక్షునికి లేఖ రాశారు. ‘‘రాష్ట్ర విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో సహా .. ఆర్థికలోటు భర్తీ, పోలవరం పూర్తి, వెనుకబడ్డ జిల్లాలకు బుందేల్‌ఖండ్‌ తరహాలో ప్రత్యేక ప్యాకేజీ, రాజధాని నగర నిర్మాణానికి ఆర్థిక సాయం, 58:42 దామాషాలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు ఆస్తుల పంపకం, వైజాగ్‌ - చెన్నయ్‌ పారిశ్రామిక కారిడార్‌, విశాఖ రైల్వే జోన్‌, దుగరాజుపట్నం ఓడరేవు, కడపలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామంటూ పార్లమెంటులో అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ హామీ ఇచ్చారు. అవేవీ ఇప్పటివరకూ నెరవేరలేదు. 2018 సెప్టెంబరు 18న కర్నూలు బహిరంగ సభలో రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ... తాము అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇస్తూ తొలిసంతకం చేస్తానని హామీ ఇచ్చారు’’ అని గిడుగు తన లేఖలో పేర్కొన్నారు.

Updated Date - 2023-09-18T02:20:54+05:30 IST