‘రాగిజావ’ మళ్లీ వాయిదా
ABN , First Publish Date - 2023-03-10T02:45:28+05:30 IST
పాఠశాలల విద్యార్థులకు అదనపు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించాలనుకున్న రాగి జావ పంపిణీ కార్యక్రమం మళ్లీ వాయిదా పడింది. తొలుత ఈ నెల 2న ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది.
మొదట ఈ నెల 2న ముహూర్తం
తర్వాత 10కి, ఇప్పుడు 21వ తేదీకి వాయిదా
అమరావతి, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): పాఠశాలల విద్యార్థులకు అదనపు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించాలనుకున్న రాగి జావ పంపిణీ కార్యక్రమం మళ్లీ వాయిదా పడింది. తొలుత ఈ నెల 2న ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. అనంతరం 10వ తేదీకి వాయిదా వేసింది. రాగి జావ ఎలా తయారుచేయాలి, కావాల్సిన వస్తువులు రేషన్ షాపు వద్ద ఎలా తీసుకోవాలి అనే వివరాలను బుధవారం విడుదల చేసింది. అయితే మళ్లీ ఈ కార్యక్రమాన్ని ఈ నెల 21కి వాయిదా వేస్తున్నట్లు గురువారం జిల్లాల అధికారులకు సమాచారం పంపింది. పదే పదే వాయిదాలు పడుతుండటంతో ఈ లోపు వేసవి సెలవులు వచ్చేస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సెలవులకు ముందు పథకాన్ని ప్రారంభించడం వల్ల ఉపయోగం ఏంటనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.