Purandeshwari : పవన్ వ్యాఖ్యల్లో తప్పేముంది?
ABN , First Publish Date - 2023-09-18T02:48:42+05:30 IST
జనసేన విస్తృతస్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను తాను తప్పుగా చూడటం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి చెప్పారు.

బాబు అరెస్టును ముందుగా తప్పుబట్టింది బీజేపీయే: పురందేశ్వరి
విజయవాడ, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): జనసేన విస్తృతస్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను తాను తప్పుగా చూడటం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి చెప్పారు. ఆదివారం విజయవాడలో మోదీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనసేన ఇప్పటికీ బీజేపీతో పొత్తు కొనసాగిస్తోందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను అధిష్ఠానానికి వివరిస్తానని తెలిపారు. చంద్రబాబును అరెస్టు చేసిన విధానాన్ని బీజేపీయే ముందుగా తప్పుబట్టిందన్నారు. అరెస్టును ఖండిస్తున్నట్టు ప్రకటన చేశామని తెలిపారు. అరెస్టు వెనుక బీజేపీ ఉందనేది అసత్యప్రచారమని కొట్టిపారేశారు. సీఐడీ ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తోందని, రెండు తెలుగు రాష్ట్రాల్లోని బీజేపీ నేతలు చంద్రబాబు అరెస్టును ఖండించారని వివరించారు.