గుంటూరులో పులివెందుల పోలీసుల హల్‌చల్
ABN , First Publish Date - 2023-06-07T03:41:17+05:30 IST
గుంటూరులో ఈ దఫా పులివెందుల పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టారనే కారణంతో టీడీపీ కార్యకర్త ఇంటిపై దౌర్జన్యం చేశారు.
● ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు పెట్టారనిటీడీపీ కార్యకర్తపై దౌర్జన్యం
గుంటూరు, జూన్ 6: గుంటూరులో ఈ దఫా పులివెందుల పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టారనే కారణంతో టీడీపీ కార్యకర్త ఇంటిపై దౌర్జన్యం చేశారు. ప్రైవేటు వాహనంలో మఫ్టీలో వచ్చిన కొందరు వ్యక్తులు నగరంపాలెం పోలీస్ స్ట్టేషన్ పరిధిలోని లాల్‌పురం రోడ్డులో గల కావేరీనగర్‌లో ఉంటున్న కరణం ప్రభాకర్ అనే టీడీపీ కార్యకర్త ఇంటిపై మంగళవారం మధ్యాహ్నం మూకుమ్మడిగా దాడిచేశారు. నైట్‌డ్రెస్‌లో ఉన్న కరణం ప్రభాకర్‌ను చొక్కా కాలర్ పట్టుకుని గుంజుకు వెళ్లారు. తాము పులివెందుల పోలీసులమని, మీరు పులివెందుల పోలీస్ స్టేషన్‌కు రండి అంటూ వెళ్లిపోయారు. అయితే ప్రభాకర్‌ను అదుపులోకి తీసుకున్న వారు ముందుగా నగరంపాలెం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి.. గతంలో సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టిన కేసులో నిందితుడిగా ఉన్న ప్రభాకర్‌ను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నామని సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు స్టేషన్ వద్దకు వచ్చేసరికే,ప్రభాకర్‌ను తీసుకొని వెళ్లిపోయారు. అయితే, అయిమీడియాలో అరెస్టుపై కథనాలు రావడంతో ప్రభాకర్‌కు కొందరు న్యాయవాదుల సమక్షంలో 41ఏ నోటీసు జారీ చేసి వెళ్లిపోయారు.