30న PSLV వి-సీ56 రాకెట్‌ ప్రయోగం

ABN , First Publish Date - 2023-07-23T01:55:23+05:30 IST

రాకెట్‌ను ఈ నెల 30న ఉదయం 6.30 గంటలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్‌ నుంచి ప్రయోగించాలని ఇస్రో శాస్త్రవేత్తలు నిర్ణయించారు. రాకెట్‌ అనుసంధాన పనులను పూర్తి చేశారు.

30న PSLV వి-సీ56 రాకెట్‌ ప్రయోగం

సింగపూర్‌ ఉపగ్రహం, 6 పేలోడ్‌లతో రోదసిలోకి

మొదటి ప్రయోగ వేదికకు రాకెట్‌ తరలింపు

సూళ్లూరుపేట, జూలై 22: పీఎ్‌సఎల్వీ-సీ 56 రాకెట్‌ను ఈ నెల 30న ఉదయం 6.30 గంటలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్‌ నుంచి ప్రయోగించాలని ఇస్రో శాస్త్రవేత్తలు నిర్ణయించారు. రాకెట్‌ అనుసంధాన పనులను పూర్తి చేశారు. ఈ రాకెట్‌ ద్వారా సింగపూర్‌కు చెందిన 351.9 కిలోల బరువున్న డీఎ్‌స-ఎ్‌సఏఆర్‌ ఉపగ్రహం, మరో 6 చిన్న పేలోడ్‌లను రోదసిలోకి పంపనున్నారు. షార్‌లోని పీఎ్‌సఎల్వీ ఇంటిగ్రేటెడ్‌ ఫెసిలిటీ బిల్డింగ్‌(పీఐఎ్‌ఫ)లో రాకెట్‌ మూడు దశలను అనుసంఽధానం చేసి మొదటి ప్రయోగ వేదికకు తరలించారు. అక్కడ రాకెట్‌ శిఖర భాగాన ఉపగ్రహాన్ని అమర్చి ప్రయోగానికి సిద్ధం చేస్తారు. పీఎ్‌సఎల్వీ-సీ 56 రాకెట్‌ 44.4 మీటర్ల పొడవు, 228 టన్నుల బరువుతో ఉంటుంది. శిఖర భాగాన ఉన్న ఉపగ్రహాన్ని 535 కిలోమీటర్ల ఎత్తులో రోదసిలో విడిచిపెడుతుంది. మొదట దీన్ని ఈ నెల 26న ప్రయోగించాలని ఇస్రో భావించినప్పటికీ... సాంకేతిక కారణాలతో 30కి వాయిదా వేసింది. కాగా, పీఎ్‌సఎల్వీ సీరీ్‌సలో ఇది 58వ ప్రయోగం.

Updated Date - 2023-07-23T01:55:23+05:30 IST