రాష్ట్రంలో ప్రొక్యూర్మెంట్ పాలసీ అమలు కావడం లేదు
ABN , First Publish Date - 2023-09-26T04:50:10+05:30 IST
ఎస్ఎంఈలకు మార్కెట్ భరోసా కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2015 నుంచి అమలు చేస్తున్న పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పాలసీ మార్గదర్శకాలను రాష్ట్రంలో పాటించడం లేదని
అమరావతి, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): ఎస్ఎంఈలకు మార్కెట్ భరోసా కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2015 నుంచి అమలు చేస్తున్న పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పాలసీ మార్గదర్శకాలను రాష్ట్రంలో పాటించడం లేదని ఆంధ్రప్రదేశ్ వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య (ఏపీ చాంబర్స్) ఆరోపించింది. చాంబర్స్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు, కార్యనిర్వాహక ఉపాఽధ్యక్షుడు ఎల్ రఘురాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి బీ రాజశేఖర్, డైరెక్టర్ పీ కోటిరావు తదితరులతో కూడిన ప్రతినిధి బృందం సోమవారం రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్‌ను కలిశారు. వినతిపత్రం ఇచ్చారు. రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎ్‌సఎంఈ)ల నుంచి ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, ప్రభుత్వరంగ సంస్థలన్నీ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పాలసీ ప్రకారం 25 శాతం వస్తు, సేవలను తప్పనిసరిగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బృందం కోరింది.