Share News

వైసీపీ జెండాకు పోలీసు రక్షణ!

ABN , Publish Date - Dec 26 , 2023 | 02:59 AM

వైసీపీ జెండాలకు పోలీసులు రక్షణగా నిలవడంపై అనంతపురం జిల్లా తాడిపత్రిలో వివాదం నెలకొంది. సామాజిక సాధికార బస్సుయాత్ర సందర్భంగా 20 రోజుల కిందట పట్టణంలోని విద్యుత్‌ స్తంభాలకు వైసీపీ జెండాలు కట్టారు.

వైసీపీ జెండాకు పోలీసు రక్షణ!

బస్సుయాత్ర రోజు విద్యుత్‌ స్తంభాలకు వైసీపీ జెండాలు

వాటిని మున్సిపల్‌ సిబ్బంది తొలగిస్తుంటే.. అడ్డుకున్న ఖాకీలు

పోలీసుల తీరుపై జేసీ ప్రభాకర్‌ ఆగ్రహం.. రోడ్డుపై బైఠాయింపు

తాడిపత్రి, డిసెంబరు 25: వైసీపీ జెండాలకు పోలీసులు రక్షణగా నిలవడంపై అనంతపురం జిల్లా తాడిపత్రిలో వివాదం నెలకొంది. సామాజిక సాధికార బస్సుయాత్ర సందర్భంగా 20 రోజుల కిందట పట్టణంలోని విద్యుత్‌ స్తంభాలకు వైసీపీ జెండాలు కట్టారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పట్టణ సుందరీకరణ కోసం మున్సిపల్‌ సిబ్బంది ఆ జెండాలను తొలగించేందుకు సోమవారం ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రధాన రహదారిపై బైఠాయించారు. దీంతో సుమారు గంటపాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ట్రైనీ డీఎస్పీ హేమంత్‌కుమార్‌ వచ్చి ఆయనతో మాట్లాడారు. మున్సిపల్‌ చైర్మన్‌ అయిన తాను చెప్పినా పోలీసులు పట్టించుకోకపోవడం ఏమిటని ప్రభాకర్‌ రెడ్డి ప్రశ్నించారు. గంట సమయమిస్తే జెండాలను తొలగిస్తామని హామీ ఇవ్వడంతో జేసీ ఆందోళన విరమించారు. అయితే, సాయంత్రం వరకూ వైసీపీ జెండాలు తొలగించే పనులను పోలీసులు చేపట్టలేదు.

Updated Date - Dec 26 , 2023 | 02:59 AM