మరో కాళేశ్వరం కానున్న పోలవరం: నాగోతు
ABN , First Publish Date - 2023-12-11T02:45:22+05:30 IST
పోలవరం నిధులు జగన్ ప్రభుత్వం ఖర్చు పెట్టడం లేదని, పోలవరం మరో కాళేశ్వరం అవుతుందని బీజేపీ రాష్ట్ర కార్యద ర్శి నాగోతు రమేశ్ నాయుడు అన్నారు.
న్యూఢిల్లీ, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): పోలవరం నిధులు జగన్ ప్రభుత్వం ఖర్చు పెట్టడం లేదని, పోలవరం మరో కాళేశ్వరం అవుతుందని బీజేపీ రాష్ట్ర కార్యద ర్శి నాగోతు రమేశ్ నాయుడు అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడారు. ‘అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడానికి కారణం సీఎం జగన్ అవినీతే. నిర్లక్ష్యం మూలంగానే గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయాయి. ప్రాజెక్టుల నిర్వహణకు నిధులు కేటాయించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లించని కారణంగా రైతులకు పంట బీమా అందడం లేదు. జగన్ సీఎం కావడం దౌర్భాగ్యం. రైల్వే జోన్ ఏర్పాటు కాకపోవడానికి జగన్ సర్కార్ నిర్లక్ష్యమే కారణం’ అని రమేశ్ నాయుడు విమర్శించారు.