వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పాలి: యూత్ కాంగ్రెస్
ABN , Publish Date - Dec 22 , 2023 | 02:54 AM
ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ప్రశ్నించని వైసీపీ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పాలని ఏపీ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు లక్కరాజు
న్యూఢిల్లీ, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ప్రశ్నించని వైసీపీ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పాలని ఏపీ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు లక్కరాజు రామారావు పిలుపునిచ్చారు. విభజన హామీల అమలు కోసం కేంద్రంపై జగన్ సర్కారు పోరాడలేదని దుయ్యబట్టారు. ఏపీ యూత్ కాంగ్రెస్ అధ్వర్యంలో గురువారం ఢిల్లీ ఏపీ భవన్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. కాగా, రాష్ట్రానికి ప్రత్యేక హాదా ఎందుకు తీసుకురాలేదని ఏపీ భవన్‌లో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను యూత్ కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు..