Share News

ఆరోగ్యశ్రీలో పెండింగ్‌ నిజమే!: బుగ్గన

ABN , First Publish Date - 2023-11-29T04:14:50+05:30 IST

‘నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు మూడు నెలల ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్‌లో ఉండటం నిజమే.

ఆరోగ్యశ్రీలో పెండింగ్‌ నిజమే!: బుగ్గన

కర్నూలు(హాస్పిటల్‌), నవంబరు 28: ‘‘నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు మూడు నెలల ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్‌లో ఉండటం నిజమే. అయితే దీనికి ఇన్ని విమర్శలు ఎందుకు?’’ అంటూ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో కొత్తగా ఏర్పాటు చేసిన క్యాథ్‌ల్యాబ్‌, సీటీ స్కాన్‌, బ్లడ్‌ బ్యాంకులను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. ‘‘రాష్ట్రవ్యాప్తంగా 17 మెడికల్‌ కళాశాలలను రూ.వేలకోట్లతో ఏర్పాటు చేస్తున్నాం. ఈ క్రమంలో ఏదో ఒక విభాగంలో కొంత ఆలస్యం జరగవచ్చు. ఒక నెల బిల్లు ఆలస్యమైనంత మాత్రాన ప్రభుత్వంపై ఇన్ని రకాలుగా విమర్శలు చేయడం సరికాదు. ఆరోగ్యశ్రీ కింద ఏడాదికి రూ.10వేల కోట్లు పేద రోగుల కోసం ఖర్చు పెడుతున్నాం. ఆరోగ్యశ్రీ బిల్లులు 3 నెలలు పెండింగ్‌లో ఉండటం తప్పయితే... గతంలో 9 నెలలపాటు బిల్లులు పెండింగ్‌లో ఉండటం కరెక్టేనా?’’ అని మంత్రి బుగ్గన ప్రశ్నించారు. కార్పొరేట్‌ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చిదిద్దామని ఆయన చెప్పుకొచ్చారు.

Updated Date - 2023-11-29T04:14:51+05:30 IST