పవన్‌ ప్యాకేజీ స్టార్‌

ABN , First Publish Date - 2023-07-16T02:42:15+05:30 IST

తొండంగి, జూలై 15: ‘‘జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విప్లవకారుడు కాదు...

పవన్‌ ప్యాకేజీ స్టార్‌

జనసేన సోషల్‌ మీడియాలో కచరాగాళ్లు: మంత్రి రోజా

వలంటీర్‌ను పెట్టి పవన్‌ను ఓడిస్తాం: మంత్రి జోగి

పవన్‌ రాజకీయ వ్యభిచారి: మంత్రి సీదిరి అప్పలరాజు

నందికొట్కూరు, ముమ్మిడివరం, పోర్టుసిటీ(కాకినాడ), తొండంగి, జూలై 15: ‘‘జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విప్లవకారుడు కాదు... ప్యాకేజీ స్టార్‌. మెంట ల్‌ ఆసుపత్రిలో పిచ్చిపట్టిన వాడికి కరెంటు షాక్‌ ఇస్తున్న సమయంలో మధ్య లో పారిపోయి వచ్చిన వాడు ఎలా ఉంటాడో పవన్‌ పరిస్థితి కూడా అలాగే ఉంది’’ అని మంత్రి ఆర్కే రోజా అన్నారు. శనివారం నంద్యాలలో ఆమె మాట్లాడారు. ‘‘ఏపీలో పవన్‌కు ఇల్లు లేదు. ఆయన పార్టీకి 26 జిల్లాల్లో అధ్యక్షులు లేరు, 175 స్థానాల్లో నిలబడే అభ్యర్థులూ లేరు. జనసేన సోషల్‌ మీడియాలో కంటెంట్‌ లేని కచరాగాళ్లు ఉంటే.. వైసీపీ సోషల్‌ మీడియాలో కంటెంట్‌ ఉన్న అభిమానులు ఉన్నారు’’ అని రోజా అన్నారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో మంత్రి జోగి రమేశ్‌ మాట్లాడుతూ.. ‘‘వలంటీర్లను కించపరుస్తున్న పవన్‌ కల్యాణ్‌కు దమ్ము, ధైర్యం, చీము, నెత్తురు ఉంటే టీడీపీతో పొత్తు పెట్టుకోకుం డా ఒంటరిగా పోటీ చేయాలి. అతనిపై వలంటీరును పెట్టి ఓడిస్తాం. దమ్ము ధైర్యం ఉంటే నా చాలెంజ్‌ని స్వీకరించాలి’’ అన్నారు. మరో మంత్రి సీదిరి అప్పలరాజు కాకినాడ జిల్లా జగ్గంపేటలో మాట్లాడుతూ.. ‘‘పవన్‌తో మాట్లాడించేది చంద్రబాబే. అవగాహన లేకుండా కేవలం డబ్బుల కోసం అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. తాగేసి ఏకవచంతో మాట్లాడే పనికిమాలిన వాడు పవన్‌. పవన్‌ రాజకీయ పార్టీ పెట్టి రాజకీయ వ్యభిచారం చేస్తే ప్రజలు ఎప్పటికీ నమ్మరు’’ అని మండిపడ్డారు. మరో మంత్రి దాడిశెట్టి రాజా కాకినాడ జిల్లా పెరుమాళ్లపురంలో మాట్లాడుతూ.. పవన్‌ మాటల్లో ముఖ్యమంత్రి జగన్‌పై ఈర్ష్య అసూయలే కనిపిస్తున్నాయన్నారు. పవన్‌ కళ్లల్లో ఓటమి భయం కనిపిస్తోందన్నారు.

Updated Date - 2023-07-16T02:42:15+05:30 IST