పవన్‌కు రాజకీయ లక్షణాలు లేవు
ABN , First Publish Date - 2023-10-03T03:19:07+05:30 IST
జనం, జగన్ ఒకటయ్యారు. జనం లేని పొత్తులు ఎన్ని అయితే ఏమిటి..? ఎవరు ఒకటైనా మాకు అభ్యంతరం లేదు’’
దీక్ష ఎవరైనా చేయవచ్చు.. అర్హత ఉండాలి: స్పీకర్ తమ్మినేని
దొంగ దీక్ష చేయడం మహాత్ముని అవమానించడమే: రోజా
తిరుచానూరు, అక్టోబరు 2: ‘‘జనం, జగన్ ఒకటయ్యారు. జనం లేని పొత్తులు ఎన్ని అయితే ఏమిటి..? ఎవరు ఒకటైనా మాకు అభ్యంతరం లేదు’’ అని శాసనసభ స్వీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. తిరుపతి శిల్పారామంలో సోమవారం స్వాతంత్య్ర సమరయోధుల సంస్మరణ నివాళి గోడ (ట్రిట్యూట్ వాల్) భూమి పూజకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మరో ఆరు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ప్రజలు సరైన తీర్పు ఇస్తారు. దీక్ష ఎవరైనా చేయవచ్చు. దానికి ఓ అర్హత ఉండాలి. భువనేశ్వరి... బస్సు యాత్ర కాకపోతే హెలికాప్టర్ యాత్ర చేసుకున్నా ఎలాంటి ఇబ్బందిలేదు’’ అని సీతారాం అన్నారు. మంత్రి రోజా మాట్లాడుతూ... ‘‘తప్పుచేసి జైల్లో కూర్చుని ఏదో త్యాగం చేసినట్లు చంద్రబాబు దొంగ దీక్ష చేయడం, బయట ఆయన భార్య దీక్ష చేయడం మహాత్మాగాంధీని అవమానించినట్లే. 15 సీట్లకు అభ్యర్థులు లేని పార్టీ జనసేన. సన్నాసి సన్నాసి కలిస్తే బూడిదే రాలుతుంది. నాపై వ్యాఖ్యలు చేసిన బండారు సత్యనారాయణ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది’’ అని రోజా అన్నారు.