కన్నేశారు.. కొట్టేశారు

ABN , First Publish Date - 2023-06-02T04:33:03+05:30 IST

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నడిబొడ్డున ఆర్‌అండ్‌బీకి రెండెకరాల స్థలం ఉంది. మార్కెట్‌ విలువ ప్రకారం దాని ధర దాదాపు రూ.100 కోట్లు. దీనిపై అధికార పార్టీ నేతల కన్ను

కన్నేశారు.. కొట్టేశారు

● వైసీపీకి రాజమండ్రిలో రూ.100 కోట్ల స్థలం

● ఆర్‌అండ్‌బీ స్థలంలో పార్టీ కార్యాలయం

రాజమహేంద్రవరం, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నడిబొడ్డున ఆర్‌అండ్‌బీకి రెండెకరాల స్థలం ఉంది. మార్కెట్‌ విలువ ప్రకారం దాని ధర దాదాపు రూ.100 కోట్లు. దీనిపై అధికార పార్టీ నేతల కన్ను పడింది. ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ను ఆనుకుని ఉన్న ఈ స్థలంలో వైసీపీ కార్యాలయం నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలన్నీ గోప్యంఉంచారు. ప్రభుత్వం ఈ స్థలాన్ని కేటాయించడంతో హడావుడిగా నిర్మాణ పనులు ప్రారంభించారు. చెట్లు కొట్టేసి, ఆ స్థలంలోని షెడ్‌లో ఏళ్ల తరబడి ఉంటున్న వాచ్‌మన్‌ కుటుంబాన్ని ఖాళీ చేయించారు. ఈ ప్రాంతంలో ప్రభుత్వ రిజిస్ట్రేషన్‌ విలువ ప్రకారం గజం ధర రూ.26 వేలు ఉంది. బయట మార్కెట్‌లో గజం సుమారు రూ.లక్ష వరకూ ఉంటుంది. గత కేబినెట్‌ సమావేశం అజెండాలో ఇది ఉంది. కానీ దానిని ఆమోదించినట్టు బయటకు చెప్పలేదు. స్థానిక ఆర్‌అండ్‌బీ అధికారులకు సమాచారం ఇవ్వలేదు. 2ఎకరాల భూమిని వైసీపీ కార్యాలయానికి ప్రభుత్వం ఇచ్చినట్టు మాత్రమే రెవెన్యూ అధికారులకు చెప్పారు. ఎంతకాలం లీజుకు ఇచ్చారు? ఎంత రేటుకు ఇచ్చారు? అన్నదానిపై స్పష్టత లేదు.


Updated Date - 2023-06-02T04:33:03+05:30 IST