చంద్రబాబుపై కక్ష సాధింపు

ABN , First Publish Date - 2023-09-22T23:34:23+05:30 IST

అధికారంలోకి వచ్చాక జగనరెడ్డి సైకోలా ప్రవర్తిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై కక్షసాధిం పు చర్యలకు పాల్పడుతున్నాడుని మదనపల్లె టీడీపీ ఇనచార్జి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ ధ్వజమెత్తారు.

చంద్రబాబుపై కక్ష సాధింపు
మీడియాతో మాట్లాడుతున్న షాజహానబాషా, నల్లారి తనూజారెడ్డి

వైసీపీ ప్రభుత్వ తీరుపై టీడీపీ ఇనచార్జి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ ఆగ్రహం కొనసాగుతున్న టీడీపీ శ్రేణుల ఆందోళనలు

మదనపల్లె టౌన, సెప్టెంబరు 22: అధికారంలోకి వచ్చాక జగనరెడ్డి సైకోలా ప్రవర్తిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై కక్షసాధిం పు చర్యలకు పాల్పడుతున్నాడుని మదనపల్లె టీడీపీ ఇనచార్జి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ ధ్వజమెత్తారు. శుక్రవారం స్థానిక టీడీపీ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న రిలేదీక్షలో పాల్గొన్న దొమ్మలపాటి మాట్లాడుతూ 73 ఏళ్ల వ్యక్తిని జైల్లో పెట్టి సౌకర్యాలు కల్పించకుండా జగన అతి పెద్దతప్పు చేస్తున్నాడన్నారు. రాబోయే రోజుల్లో ఈ తప్పులే శాపాలై జగనను చుట్టుకుంటాయన్నారు. లక్షల కోట్లు దోపిడీ చేసిన జగన 16 నెలలు జైల్లో ఉన్నారని ఏ తప్పు చేయని చంద్రబాబును అక్రమ అరెస్టు చేశాడన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి పరిశీలనలో రూ.లక్ష మద్యం విక్రయాలకు రూ.700 బిల్లు ఇచ్చారని, మిగిలిన సొమ్మంతా తాడేపల్లె ప్యాలెస్‌కు వెళ్లిందని ఆరోపించారు. వ్యవ స్థలను, బ్యూరోక్రాట్లను గుప్పిటిపెట్టుకుని జగన నాటకాలు అడుతున్నా రన్నారు. రాబోయే రోజుల్లో సైకో జగనతో పాటు, వంత పాడిన మం త్రులు మూల్యం చెల్లించక తప్పదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు భవానిప్రసాద్‌, కొండ్రెడ్డి, ఎస్‌ఎం రఫి, విజయకు మార్‌గౌడ్‌, రెడ్డెప్పరెడ్డి, మల్లయ్య, తులసీధర్‌నాయుడు, మహాలక్ష్మి, రాధ, నందిని తదితరులు పాల్గొన్నారు.

నిమ్మనపల్లెలో: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును రాజకీ య కక్షతోనే అరెస్ట్‌ చేసి జైలుకు పంపారని రాజంపేట అధికార ప్రతినిఽ ది ఆర్జే వెంవటేశ, మాజీ సర్పంచ మాధవిలత ఆరోపించారు. శుక్రవారం మండలంలోని రాచవేటివారిపల్లి గ్రామ పంచాయతిలో చంద్రబాబును విడుదల చేయాలని పెద్ద ఎత్తున మహిళలు కొవ్వొత్తుల ర్యాలీని చేప ట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగనమోహన రెడ్డి రాజకీ య కక్షతోనే 74ఏళ్ల వయస్సులో చంద్రబాబును జైలుకు పంపించి తన శునకానందాన్ని పొందుతున్నరని ఆరోపించారు. చంద్రబాబును విడు దల చేయాలని మహిళలంతా కొవ్వోత్తులు వెలిగించి సైకో పోవాలి .. సైకిల్‌ రావాలి అంటూ నినాదాలు చేశారు. ఓటమి భయంతోనే జగన ఇలాంటి పనులకు పూనుకొంటున్నాడని అరోపించారు. వచ్చే ఎన్నికల్లో పైసీపీ భూస్థాపితం అవడం ఖాయమన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ భాస్కర్‌ గ్రామ అధ్యక్షుడు శ్రీనివాసులు ఈశ్వరమ్మ, లలిత, గౌరమ్మ, రాణేమ్మ పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.

చంద్రబాబు ఆరోగ్యం కోసం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు

కలికిరి, సెప్టెంబరు 22: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడుగా రావాలని కోరుతూ మండలంలోని మహల్‌ హజరత స్యద్‌ మోదీనషా వల్లీ దర్గా వద్ద టీడీపీ నాయకులు శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఎటువంటి ఆధారాలు లేకుండా అభూత కల్పనల తో ఒక జాతీయ స్థాయి నాయకుడిని నిర్భంధించడం క్షమార్హం కాదని పేర్కొన్నారు. ఇది కేవలం వైసీపీ కక్ష సాధింపు చర్య మాత్రమేనని విమ ర్శించారు. మహల్‌, అద్దవారిపల్లె పంచాయతీలకు చెందిన మాజీ సర్పం చులు మహ్మదాలీ, సతీష్‌కుమార్‌ రెడ్డి, పెద్దన్న, నాయకులు ఐటీడీపీ ఇనచార్జీ షబ్బీర్‌ హుస్సేన, బాబ్జి, నాగయ్య, వెంకట్రమణ, నదీమ్‌, ఆజం షేర్‌ఖాన, సలావుద్దీన, సర్వర్‌, చాంద్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

జగన పాలనలో రాష్ట్రం అథోగతిపాలు

మదనపల్లె టౌన, సెప్టెంబరు 22: రాష్ట్రంలో జగన పాలనలో రాష్ట్రం అథోగతి పాలవడం తథ్యమని మాజీ ఎమ్మెల్యే షాజహానబాషా పేర్కొన్నారు. శుక్రవారం మదనపల్లెకు చేరు కున్న ఆయన స్థానిక ఎన్టీఆర్‌ విగ్రహానికి పూజలు చేసి, సబ్‌జైలులో రిమాండులో ఉన్న టీడీపీ నాయకులను పరామర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్య దర్శి నల్లారి కిశోర్‌ సతీమణి తనూజారెడ్డితో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా పనిచేసినా ఏ రోజు కూడా ఏ స్కామ్‌లో లేరన్నారు. సీఐడీ అధికారులు 2021లో పెట్టిన స్కిల్‌ కేసు ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేదని కాని దగ్గరలో ఎన్నికలు వస్తున్నాయని కావాలనే అరెస్టు చేశారన్నారు.. స్కిల్‌ కేసులో అప్పట్లో పనిచేసిన అధికారులపై కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఐదేళ్లలో చంద్రబాబు అభివృద్ధికి నాంది పలికితే ఇప్పుడు నాలు గున్నరేళ్లలో జగన ఏమి అభివృద్ధి చేశాడన ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ సింగిల్‌ డిజిట్‌తో మిగిలిపోతుందన్నారు. తనూజారెడ్డి మాట్లాడుతూ అక్రమే కేసుల్లో ఇరుకున్న ప్రతి టీడీపీ నాయకుల కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో పెద్దఎత్తున టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-22T23:34:23+05:30 IST