పంచాయతీ నిధులు పీఎఫ్‌ఎంఎస్‌ ఖాతాలో వేయాలి

ABN , First Publish Date - 2023-06-01T05:26:16+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల నిధులను పీఎఫ్‌ఎంఎస్‌ ఖాతాల్లో వేయాలని ఏపీ సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు, అఖిల భారత

పంచాయతీ నిధులు పీఎఫ్‌ఎంఎస్‌ ఖాతాలో వేయాలి

ఏపీ సర్పంచ్‌ల సంఘం డిమాండ్‌

అమరావతి, మే 31(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల నిధులను పీఎఫ్‌ఎంఎస్‌ ఖాతాల్లో వేయాలని ఏపీ సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు, అఖిల భారత పంచాయతీ పరిషత్‌ జాతీయ ఉపాధ్యక్షులు జాస్తి వీరాంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం సచివాలయంలో 15వ ఆర్థిక సంఘం నిధుల విషయంపై ఆర్థికశాఖ అధికారులతో చర్చించారు. గ్రామ పంచాయతీల్లో నిధుల సమస్యలను అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ అధికారులు నాలుగైదు రోజుల్లో పంచాయతీలకు నిధులు విడుదల చేస్తామని చెప్పినట్టు పాపారావు తెలిపారు. 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.988.34 కోట్లు రాష్ట్రంలోని స్థానికసంస్థలకు విడుదలవుతున్నాయని, గ్రామ పంచాయతీలకు రూ.691.84 కోట్లు అందుతాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఐదో ఆర్థిక సంఘం నిధులను గ్రామ పంచాయతీలకు విడుదల చేయాలని పాపారావు, వీరాంజనేయులు డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-06-01T05:26:16+05:30 IST