Share News

వ్యూహంపై ప్రస్తుత వ్యాజ్యాన్ని పిల్‌తో జత చేయండి

ABN , Publish Date - Dec 30 , 2023 | 02:40 AM

వ్యూహం సినిమాకు జారీచేసిన సెన్సార్‌ సర్టిఫికేట్‌ను పునఃసమీక్షించేలా సెన్సార్‌ బోర్డును ఆదేశించాలని కోరుతూ ఏపీ కాంగ్రెస్‌ కమిటీ ఉపాధ్యక్షుడు దాఖలు చేసిన పిటిషన్‌ శుక్రవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఎవరూ హాజరుకాలేదు.

వ్యూహంపై ప్రస్తుత వ్యాజ్యాన్ని పిల్‌తో జత చేయండి

రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశం

అమరావతి, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): వ్యూహం సినిమాకు జారీచేసిన సెన్సార్‌ సర్టిఫికేట్‌ను పునఃసమీక్షించేలా సెన్సార్‌ బోర్డును ఆదేశించాలని కోరుతూ ఏపీ కాంగ్రెస్‌ కమిటీ ఉపాధ్యక్షుడు దాఖలు చేసిన పిటిషన్‌ శుక్రవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఎవరూ హాజరుకాలేదు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది జూపూడి యజ్ఞదత్‌ స్పందిస్తూ... ‘ఇదే సినిమాపై ఇప్పటికే పిల్‌ దాఖలైందని, దీనిపై విచారణ సంక్రాంతి సెలవుల తర్వాతికి వాయిదా పడిందని అని తెలిపారు. వివరాలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి ఇదే సినిమా విషయంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు దాఖలు చేసిన పిల్‌తో ప్రస్తుత పిటిషన్‌ను జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. విచారణను 4వారాలకు వాయిదా వేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.జయసూర్య ఆదేశాలిచ్చారు.

Updated Date - Dec 30 , 2023 | 02:40 AM