మెరుగైన పెన్షన్‌కు ఓపీఎస్‌ ఒక్కటే మార్గం

ABN , First Publish Date - 2023-08-22T03:33:19+05:30 IST

దేశవ్యాప్తంగానూ, రాష్ర్టాలలో పాత పెన్షన్‌ స్కీమ్‌ (ఓపీఎ్‌స)ను పునరుద్ధరించాలంటే కేంద్రం తీసుకు వచ్చిన పీఎ్‌ఫఆర్‌డీ యాక్టు రద్దయితే తప్ప సాధ్యం కాదని ఆలిండియా ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు సుభాష్‌ లాంబా అన్నారు.

మెరుగైన పెన్షన్‌కు ఓపీఎస్‌ ఒక్కటే మార్గం

నవంబరు 9న చలో పార్లమెంట్‌

ఏపీఎన్‌జీఓ రాష్ట్ర మహాసభల్లో ఆలిండియా ప్రభుత్వ ఉద్యోగ సంఘాల సమాఽఖ్య దిశా నిర్దేశం

మెరుగైన ఐఆర్‌ ఇవ్వాలి: సీఎంను కోరిన బండి

నేను సీఎం దూతను.. సొంత ఆలోచనలతో పనిచేయను: సజ్జల

విజయవాడ, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగానూ, రాష్ర్టాలలో పాత పెన్షన్‌ స్కీమ్‌ (ఓపీఎ్‌స)ను పునరుద్ధరించాలంటే కేంద్రం తీసుకు వచ్చిన పీఎ్‌ఫఆర్‌డీ యాక్టు రద్దయితే తప్ప సాధ్యం కాదని ఆలిండియా ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు సుభాష్‌ లాంబా అన్నారు. సోమవారం విజయవాడ ఐజీఎంసీ స్టేడియంలో జరిగిన ఏపీఎన్‌జీఓ 21 వ రాష్ట్ర మహాసభల్లో ఆయన మాట్లాడుతూ, ఎన్‌పీఎ్‌స(న్యూ పెన్షన్‌ స్కీమ్‌)పై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలను కూడా కలుపుకుని జాతీయ స్థాయిలో ఆగస్టు 9వ తేదీ నుంచి ఉద్యమానికి శ్రీకారం చుట్టామని, నవంబరు 9వ తేదీన ఛలో పార్లమెంట్‌ కార్యక్రమానికి పిలుపు ఇచ్చామని తెలిపారు. ఆలిండియా ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల సమాఖ్య కార్యదర్శి శ్రీకుమార్‌ మాట్లాడుతూ, దక్షిణాదిలో కర్ణాటక, తెలంగాణ , తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాల్లోని ఉద్యోగులు కనీసం ఐదేళ్లకు ఒకసారి పీఆర్‌సీని అందుకుంటున్నారని, దేశ వ్యాప్తంగా పే కమిషన్‌ మాత్రం వేయటం లేదన్నారు. చలో పార్లమెంట్‌కు మద్దతు తెలపాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కాగా, తనను ముఖ్యమంత్రి జగన్‌కు తిమ్మరసుగా అభివర్ణించిన బండి వ్యాఖ్యలనుద్దేశించి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, తాను సొంత ఆలోచనలతో పనిచేయనన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనా విధానానికి అనుగుణంగా, ఉద్యోగులను ప్రభుత్వంలో భాగస్వామ్యంగా పరిగణించే ముఖ్యమంత్రి దూతగా మాత్రమే పనిచేస్తానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సలహాదారు ఎన్‌.చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ, ఈ ప్రభుత్వంలో జరిగినన్ని జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశాలు కానీ, మంత్రుల కమిటీ మీటింగ్‌లు కానీ, సీఎస్‌ సమీక్షలు కానీ మరే ప్రభుత్వంలో జరగలేదన్నారు. ఏపీఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని కొనియాడారు.

Updated Date - 2023-08-22T03:33:19+05:30 IST