Share News

మిత్రుని వివాహానికి వెళుతూ మృత్యుఒడికి

ABN , First Publish Date - 2023-11-10T04:29:01+05:30 IST

వారు ముగ్గురూ ప్రాణ స్నేహితులు. గురువారం సాయంత్రం స్నేహితుడి వివాహానికి బయలుదేరిన వారిని మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో

మిత్రుని వివాహానికి వెళుతూ  మృత్యుఒడికి

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకుల మృతి

ఉక్కుటౌన్‌షిప్‌ (విశాఖపట్నం), నవంబరు 9: వారు ముగ్గురూ ప్రాణ స్నేహితులు. గురువారం సాయంత్రం స్నేహితుడి వివాహానికి బయలుదేరిన వారిని మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. విశాఖ జిల్లా గంగవరం ప్రాంతానికి చెందిన అర్జిల్లి సోమేశ్‌ (19), కదిరి వాసు (19), కొవిరి రాజు స్నేహితులు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఉంటున్న స్నేహితుడి వివాహానికి హాజరయ్యేందుకు గురువారం సాయంత్రం ముగ్గురూ ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. స్టీల్‌ప్లాంట్‌ టౌన్‌షిప్‌ సెక్టార్‌-10 ప్రాం తానికి వచ్చేసరికి వాహనం అదుపుతప్పి డివైడర్‌పైకి దూసుకువెళ్లి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొంది ఈ ప్రమాదంలో సోమేశ్‌, వాసు అక్కడికక్కడే మృతిచెందారు. రాజుకు తీవ్రగాయాలు కావడంతో తొలుత ఉక్కు జనరల్‌ ఆస్పత్రికి, అక్కడ నుంచి కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాజు చనిపోయాడు.

Updated Date - 2023-11-10T04:29:02+05:30 IST