Share News

7న విశాఖలో ఓబీసీ మోర్చా సభ: పురందేశ్వరి

ABN , Publish Date - Dec 26 , 2023 | 03:04 AM

ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో జనవరి 7న విశాఖపట్నంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తెలిపారు.

7న విశాఖలో ఓబీసీ మోర్చా సభ: పురందేశ్వరి

అమరావతి, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో జనవరి 7న విశాఖపట్నంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తెలిపారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆమె సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఓబీసీ కమిషన్‌కు అటల్‌ బిహారీ వాజపేయి ప్రభుత్వం చట్ట బద్ధత కల్పించిందని గుర్తు చేశారు. వాజపేయి జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఆమె అటల్‌ బిహారీ హాయాంలో జరిగిన పోక్రాన్‌ అణు పరీక్షలు, దేశాభివృద్ధి గురించి మాట్లాడారు. అనంతరం ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం రొంగలి గోపీ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో జరిగింది.

Updated Date - Dec 26 , 2023 | 03:04 AM