వాతావరణ ఆధారిత పంటల బీమాకు నోటిఫికేషన్
ABN , First Publish Date - 2023-10-06T04:16:37+05:30 IST
డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా, పునర్‌వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా అమలుకు 2023 ఖరీ్‌ఫకు, 2023-24 రబీ పంటలకు జిల్లాల వారీగా, ఇతర కార్యాచరణ పద్ధతులపై ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
కేంద్రంతో కలిసి బీమా అమలు చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం
అమరావతి, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా, పునర్‌వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా అమలుకు 2023 ఖరీ్‌ఫకు, 2023-24 రబీ పంటలకు జిల్లాల వారీగా, ఇతర కార్యాచరణ పద్ధతులపై ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈమేరకు గురువారం గెజిట్ జారీ అయింది. కేంద్ర ప్రభుత్వంతో కలిసి పంటల బీమా అమలు చేయనున్నట్లు తెలిపింది. నోటిఫైడ్ వ్యవసాయ, ఉద్యాన పంటలు సాగు చేస్తున్న రైతులందరికీ ఈ-క్రాప్ ఆధారంగా సోషల్ ఆడిట్ జరిగాక బీమా కవరేజ్‌కు అర్హత ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొంది. బీమా క్లైములను రాష్ట్ర ప్రభుత్వ మండల స్థాయి రెయిన్‌గేజ్‌లు, భారత వాతావరణ శాఖ కేంద్రాలు అందించే వాతావరణ సమాచారం ఆధారంగా పరిష్కరిస్తామని తెలిపింది. జాతీయ పంటల బీమా పోర్టల్‌లో ఆమోదించిన అన్ని క్లైములకు ప్రీమియం సబ్సిడీ, రైతు వాటాను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని పేర్కొంది. అయితే వ్యక్తిగత నష్టంపై కాకుండా కరువు, వరదల వంటి విపత్తు నష్టాలపై ప్రభుత్వ ఉత్తర్వులను పరిగణలోకి తీసుకోనున్నట్టు స్పష్టం చేసింది. ఇందుకోసం ఎంప్యానల్ చేసిన వివిధ బీమా కంపెనీల ఆన్‌లైన్ బిడ్‌లు ఖరారైనట్లు తెలిపింది. యూనివర్సల్ సొంపో, బజాజ్ అలియన్జ్, హెచ్‌డీఎ్‌ఫసీ కంపెనీలను ఎంపిక చేసింది.