ఎమ్మెల్యే కార్యక్రమాలకు రావడం లేదని
ABN , First Publish Date - 2023-08-02T04:04:28+05:30 IST
జగనన్న సురక్ష కార్యక్రమానికి రాలేదని, అలాగే కొందరు అధికారపక్ష నేతల అడుగులకు మడుగులు ఒత్తడం లేదనే కారణంతో ఐదుగురు వలంటీర్లను గ్రామకార్యదర్శి ఆఘమేఘాలపై తొలగించారు.
ఐదుగురు వలంటీర్ల తొలగింపు
ద్వారకా తిరుమల, ఆగస్టు 1: జగనన్న సురక్ష కార్యక్రమానికి రాలేదని, అలాగే కొందరు అధికారపక్ష నేతల అడుగులకు మడుగులు ఒత్తడం లేదనే కారణంతో ఐదుగురు వలంటీర్లను గ్రామకార్యదర్శి ఆఘమేఘాలపై తొలగించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం రాళ్లకుంట పంచాయతీ పరిధిలోని సత్తెన్నగూడెంలో పింఛన్ల కోసం మంగళవారం ఉదయం గంటల తరబడి వేచివున్న లబ్ధిదారులకు ఈ విషయం తెలియడంతో ఒక్కసారిగా షాక్ తిన్నారు. కుమ్మరి హేమలత, కుమ్మరి జ్యోతి, ఎం.శ్రీమన్నారాయణ, కొత్తపల్లి ప్రసన్న, బంటుమిల్లి శ్యామల, దున్న సాయికుమారి వలంటీర్లుగా పనిచేస్తున్నారు. ఇందులో హేమలత గత వారం మానేసింది. మిగిలిన ఐదుగురు ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు చేయడం లేదని, అలాగే ఎమ్మెల్యే హాజరైన కార్యక్రమాలకు రావడం లేదని అందుకే వారిని తొలగించినట్లు గ్రామకార్యదర్శి కె.కృష్ణవేణి చెబుతున్నారు.