Share News

బాబు కార్యకలాపాలపై కోర్టు ఆంక్షల్లేవు: అచ్చెన్న

ABN , First Publish Date - 2023-11-29T04:36:23+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ కార్యకలాపాలు, ప్రజా కార్యకలాపాలపై సుప్రీంకోర్టు ఎలాంటి ఆంక్షలూ విధించలేదని అచ్చెన్నాయుడు స్పష్టంచేశారు.

బాబు కార్యకలాపాలపై కోర్టు ఆంక్షల్లేవు: అచ్చెన్న

టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ కార్యకలాపాలు, ప్రజా కార్యకలాపాలపై సుప్రీంకోర్టు ఎలాంటి ఆంక్షలూ విధించలేదని అచ్చెన్నాయుడు స్పష్టంచేశారు. ‘చంద్రబాబును రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంచాలని సీఐడీ చేసిన వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. బెయిల్‌ రద్దుపై వెంటనే విచారణ చేపట్టడానికీ అంగీకరించలేదు. అయినా జగన్‌ మీడియా కోర్టు ఆదేశాలను వక్రీకరిస్తూ ప్రచారం చేస్తోంది. బహిరంగ కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొనరాదని కోర్టు చెప్పినట్లు తప్పుడు స్ర్కోలింగులు ఇస్తున్నారు’ అని ఓ ప్రకటనలో విమర్శించారు.

Updated Date - 2023-11-29T04:40:24+05:30 IST