వివేకా కేసులో నిన్‌హైడ్రిన్‌ పరీక్ష నిర్వహణపై వాదనలు పూర్తి

ABN , First Publish Date - 2023-06-06T04:27:32+05:30 IST

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలకంగా ఉన్న లేఖకు నిన్‌హైడ్రిన్‌ పరీక్ష జరిపే అంశంపై సీబీఐ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. నిందితులు వివేకాతో ..

వివేకా కేసులో నిన్‌హైడ్రిన్‌ పరీక్ష నిర్వహణపై వాదనలు పూర్తి

హైదరాబాద్‌, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలకంగా ఉన్న లేఖకు నిన్‌హైడ్రిన్‌ పరీక్ష జరిపే అంశంపై సీబీఐ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. నిందితులు వివేకాతో బలవంతంగా రాయించిన ఈ లేఖకు నిన్‌హైడ్రిన్‌ పరీక్ష జరిపేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోరుతోంది. ఈ అంశంపై వాదనలు విన్న హైదరాబాద్‌ సీబీఐ కేసుల ప్రత్యేక కోర్టు తీర్పును బుధవారానికి వాయిదావేసింది. మరోవైపు భాస్కర్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై సీబీఐ కౌంటర్‌ దాఖలు చేసింది. దీనిపై వాదనలు మంగళవారానికి వాయిదాపడ్డాయి.

క్యాడర్‌ వివాదం కేసులు వాయిదా

ఐఏఎస్‌, ఐపీఎస్‌లకు సంబంధించిన క్యాడర్‌ వివాదం కేసులు జూలై 3కు వాయిదా పడ్డాయి. రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి కేటాయించినా తెలంగాణలో, తెలంగాణకు కేటాయించినా ఏపీలో కొనసాగుతున్న అధికారుల కేసులు సోమవారం జస్టిస్‌ అభినందన్‌కుమార్‌ షావిలి, జస్టిస్‌ ఎన్‌ రాజేశ్వర్‌రావు ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చాయి. కేంద్రం సమయం కోరడంతో విచారణను వాయిదా వేశారు.

Updated Date - 2023-06-06T04:27:32+05:30 IST