నవరత్నాల పేరిట నవ రంధ్రాలు
ABN , First Publish Date - 2023-04-08T04:21:51+05:30 IST
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాజఽధాని లేని రాష్ట్రానికి సీ ఎంగా జగన్ చరిత్ర కెక్కాడని, నవరత్నాల పథకాలంటూ నవరంధ్రాలు పెట్టాడని ఐటీడీపీ రాష్ట్ర కార్యదర్శి తుమ్మల చైతన్య విమర్శించారు.
రాజధాని లేని రాష్ట్రానికి సీఎంగా జగన్ చరిత్ర
విద్యాధరపురం, ఏప్రిల్ 7 : ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాజఽధాని లేని రాష్ట్రానికి సీ ఎంగా జగన్ చరిత్ర కెక్కాడని, నవరత్నాల పథకాలంటూ నవరంధ్రాలు పెట్టాడని ఐటీడీపీ రాష్ట్ర కార్యదర్శి తుమ్మల చైతన్య విమర్శించారు. ఆటోనగర్‌లోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్‌కు ఈసారి ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసి పిచ్చి ప్రేలాపనలు చేస్తూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో జగన్‌రెడ్డి కళ్లు కిందికి దిగాయన్నారు. రూ.5కే పేదలు పట్టెడన్నం తినే క్యాంటీన్లు మూయించడం దగ్గర్నుంచి పోలవరం వంటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేశాడన్నారు. జగన్‌రెడ్డిని తల్లి, చెల్లి నమ్మకపోతే ఇక రాష్ట్ర ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు.