24న కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారం
ABN , First Publish Date - 2023-02-21T03:19:32+05:30 IST
ఈ నెల 24న ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్‌గా సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
అమరావతి, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 24న ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్‌గా సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుత గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు ప్రభుత్వం మంగళవారం (ఈ నెల 21న) వీడ్కోలు పలకనుంది. బుధవారం రాత్రికి కొత్త గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ విజయవాడకు వస్తారు. ఈ నెల 24న ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు.