ఎమ్మెల్సీ ఫలితాలు.. ప్రజా తిరుగుబాటు

ABN , First Publish Date - 2023-03-19T02:09:43+05:30 IST

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కేవలం విద్యావంతుల్లో వచ్చిన తిరుగుబాటు అనుకుంటే పొరపాటని, ఇది ప్రజల్లో వచ్చిన తిరుగుబాటుగా భావించాలని ఎంపీ రఘురామరాజు స్పష్టం చేశారు. ప్రజల్లో మార్పు మొదలైందని, ఇదే విషయాన్ని తాను గత రెండున్నరేళ్లుగా చెబుతున్నానని తెలిపారు.

ఎమ్మెల్సీ ఫలితాలు.. ప్రజా తిరుగుబాటు

వైఎస్‌ వివేకా కేసు ప్రభావం కనిపించింది

ఇలాగే ఉంటే వైసీపీకి 10 సీట్లు కూడా రావు: రఘురామరాజు

న్యూఢిల్లీ, మార్చి 18(ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కేవలం విద్యావంతుల్లో వచ్చిన తిరుగుబాటు అనుకుంటే పొరపాటని, ఇది ప్రజల్లో వచ్చిన తిరుగుబాటుగా భావించాలని ఎంపీ రఘురామరాజు స్పష్టం చేశారు. ప్రజల్లో మార్పు మొదలైందని, ఇదే విషయాన్ని తాను గత రెండున్నరేళ్లుగా చెబుతున్నానని తెలిపారు. శనివారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ అభ్యర్థులు డబ్బులు పంచలేదని, కానీ తమ పార్టీ నేతలు పెద్ద ఎత్తున డబ్బులు పంచినా అయినా ఓడిపోయారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ధన ప్రభావం ఉండదని, టీడీపీ, జనసేన తోపాటు వామపక్షాలు కూడా ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తే నేతలు వెలుగులోకి వస్తారని అభిప్రాయపడ్డారు. పార్టీ అధ్యక్షుడి హోదాలో అమరావతే రాజధాని అని చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖపట్టణానికి రాజధానిని మారుస్తానని చెప్పడం, ఇందుకు మంత్రులు మద్దతునివ్వడం వల్లే ఎమ్మెల్సీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారని విశ్లేషించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై ప్రజలకు నమ్మకం ఉందని, వారు తమకు అండగా ఉంటారని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. టీడీపీకి 40 శాతం, వైసీపీకి 25 శాతం ఓటు బ్యాంకు ఉంటుందని, మిగతా 35 శాతం ఓట్లు చీలకుండా చూసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, ఇతర ప్రతిపక్షాలపై ఉందని అన్నారు. మరోవైపు గ్రాడ్యుయేట్‌ ఎన్నికల్లో వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు ప్రభావం తీవ్రంగా కనిపించిందని రఘురామ అన్నారు. తన వారిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో సీఎం జగన్‌ ఉంటే వచ్చే ఎన్నికల్లో 10 స్థానాలే వచ్చిన ఆశ్చర్యపోవలసిన అవసరం లేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి అవంతి శ్రీనివా్‌సలలో ఎవరు రాజీనామా చేస్తారని రఘురామ ప్రశ్నించారు.

Updated Date - 2023-03-19T02:09:43+05:30 IST