కాపులు మా ఆస్తి

ABN , First Publish Date - 2023-06-01T05:31:08+05:30 IST

‘‘కాపులు వైసీపీలో అంతర్భాగం. వారు మా ఆస్తి. కాపులకు పెద్ద పీట వేసింది వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, జగన్మోహన్‌రెడ్డే. స్క్రాప్‌గాళ్లు అన్న కొడాలి నాని వ్యాఖ్యలను ఐటీడీపీ తప్పుదారి పట్టించేందుకు తాపత్రయపడుతోంది. కొడాలి నానీ మాటలను కులానికి ఆపాదించడం

కాపులు మా ఆస్తి

కొడాలి వ్యాఖ్యలను తప్పుదారి పట్టించారు

మద్యపాన నిషేధంపై త్వరలో నిర్ణయం: మంత్రి జోగి

తిరుమల, మే 31(ఆంధ్రజ్యోతి): ‘‘కాపులు వైసీపీలో అంతర్భాగం. వారు మా ఆస్తి. కాపులకు పెద్ద పీట వేసింది వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, జగన్మోహన్‌రెడ్డే. స్క్రాప్‌గాళ్లు అన్న కొడాలి నాని వ్యాఖ్యలను ఐటీడీపీ తప్పుదారి పట్టించేందుకు తాపత్రయపడుతోంది. కొడాలి నానీ మాటలను కులానికి ఆపాదించడం ఘోరమైన విషయం’’ అని మంత్రి జోగి రమేశ్‌ అన్నారు. బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. ‘‘గ్రామాల్లో ఇప్పటికే బెల్ట్‌ షాపులను రద్దు చేశాం. పేద ప్రజలు ఇబ్బంది పడకుండా మద్యపాన నిషేధంపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుంది. సీపీఎస్‌ రద్దుపై అధ్యయనం జరుగుతోంది. ఉద్యోగులు మా పక్షానే ఉన్నారు. చంద్రబాబు డర్టీఫెలో. ఆయన మేనిఫెస్టో టిష్యూ పేపర్‌తో సమానం. బాబు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మరు. రాబోయే ఎన్నికల్లో బాబు, టీడీపీ అడ్రస్‌ గ ల్లంతవుతాయి’’ అని రమేశ్‌ జోస్యం చెప్పారు.

Updated Date - 2023-06-01T05:31:08+05:30 IST