Share News

Meruga Nagarjuna: తెలంగాణలో ఓటు వేసిన వారు ఏపీలో వేయకుండా చూడాలి

ABN , First Publish Date - 2023-11-29T13:23:12+05:30 IST

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓట్లు ఉన్నవారు 16 లక్షల వరకూ ఉన్నారని మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. నేడు మంత్రి జోగి రమేష్‌తో కలిసి ఆయన ఈసీని కలిశారు. అనంతరం మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. రెండు చోట్ల ఓటు ఉన్న వారిని ఒకే చోటకు పరిమితం చేయాలన్నారు.

Meruga Nagarjuna: తెలంగాణలో ఓటు వేసిన వారు ఏపీలో వేయకుండా చూడాలి

అమరావతి : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓట్లు ఉన్నవారు 16 లక్షల వరకూ ఉన్నారని మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. నేడు మంత్రి జోగి రమేష్‌తో కలిసి ఆయన ఈసీని కలిశారు. అనంతరం మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. రెండు చోట్ల ఓటు ఉన్న వారిని ఒకే చోటకు పరిమితం చేయాలన్నారు. తెలంగాణలో ఓటు వేసిన వారు ఏపీలో వేయకుండా చూడాలన్నారు. అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని ఈసీకి ఫిర్యాదు చేశామని మేరుగ నాగార్జున పేర్కొన్నారు.

ఒక వ్యక్తికి ఒకేచోట ఓటు ఉండాలనేది వైసీపీ సిద్ధాంతమని మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. లక్షల మందికి రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి వాటిని సరిచేయాలని ఎన్నికల కమిషన్‌ను కలిశామన్నారు. తెలంగాణలో ఓటు వేసిన వారికి ఏపీలోనూ ఓటు వేసే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. తెలంగాణలో ఓటు వేసిన తర్వాత అక్కడ రద్దు చేసుకుని ఇక్కడ ఓటు వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఎలాగూ ఓడిపోతారనే ఉద్దేశంతో ఎన్నికలకు ముందే మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. టీడీపీ చేవలేని పార్టీలా మారిందని జోగి రమేష్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో లోకేష్‌ను ఉరికిస్తామన్నారు. సీఎం‌ జగన్‌ను 50 రోజులు ఢిల్లీ పారిపోయిన లోకేష్ భయపెడతాడా? అని జోగి రమేష్ ప్రశ్నించారు.

Updated Date - 2023-11-29T13:23:13+05:30 IST