CM Jagan : చంద్రబాబుదికాపీ మేనిఫెస్టో

ABN , First Publish Date - 2023-06-02T03:59:19+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు మహానాడులో కాపీ మేనిఫెస్టోను విడుదల చేశారని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ‘‘రాజమహేంద్రవరం కేంద్రంగా

CM Jagan : చంద్రబాబుదికాపీ మేనిఫెస్టో

మా పథకాలను తీసుకున్నారు.. ఒంటరిగా పోటీచేసే సత్తా బాబుకు ఉందా?

పత్తికొండ సభలో జగన్‌ వ్యాఖ్యలు..

బటన్‌ నొక్కి ‘రైతు భరోసా’ నిధుల విడుదల

కర్నూలు, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత చంద్రబాబు మహానాడులో కాపీ మేనిఫెస్టోను విడుదల చేశారని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ‘‘రాజమహేంద్రవరం కేంద్రంగా మహానాడు పేరిట ఓ డ్రామా జరిగింది. ఆ డ్రామాలో ఆకర్షనీయమైన మేనిఫెస్టో ప్రకటిస్తామని చంద్రబాబు అంటే, అది ఎంత గొప్పగా ఉంటుందో అనుకున్నా. కానీ, మన అమ్మఒడి, రైతు భరోసా పథకాలను, కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ మేనిఫెస్టోలను కాపీ కొట్టి...పులిహోర మేనిఫెస్టో ప్రకటించారు’ అని జగన్‌ పేర్కొన్నారు. రైతు భరోసా–పీఎం కిసాన్‌ ఐదో విడత సాయం గురువారం కర్నూలు జిల్లా పత్తికొండలో సీఎం జగన్‌ బటన్‌ నొక్కి రైతుల ఖాతాలో జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన.. టీడీపీ మహానాడు, చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు మోసపూరిత మేనిఫెస్టోతో, పొత్తులు, ఎత్తులు, కూయుక్తులతో వస్తున్నారన్నారు. పొత్తులు లేకుండా ఒంటరిగా పోటీ చేసే ధైర్యం,సత్తా చంద్రబాబుకు ఉందా అని జగన్‌ నిలదీశారు. 175 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి టీడీపీకి అభ్యర్థులు లేరని, అందుకే పొత్తుల కోసం చంద్రబాబు ఆరాటపడుతున్నారన్నారు. కాగా, వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ పథకం ద్వారా 52.30 లక్షల మంది రైతు ఖాతాల్లో రూ.3,923.21 కోట్లు బటన్‌ నొక్కి జమ చేస్తున్నానని సీఎం జగన్‌ తెలిపారు. ప్రతి రైతుకు ఏటా రూ.13,500 చొప్పున నాలుగేళ్లు సాయం చేశామన్నారు. ఐదో ఏడాది తొలి విడతగా రూ.7.500 ఇస్తున్నామని తెలిపారు. త్వరలో కేంద్రం ఇచ్చే రూ.2 వేలు కూడా ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు.


Updated Date - 2023-06-02T03:59:19+05:30 IST