ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడు సుధీర్ అరెస్టు
ABN , First Publish Date - 2023-11-05T03:13:36+05:30 IST
కాపోలీసులు చెన్నైలో శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
చెన్నైలో అదుపులోకి తీసుకున్న పోలీసులు
నెల్లూరు, నవంబరు 4: కాపోలీసులు చెన్నైలో శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వివరాలివీ.. గత నెల 26వ తేదీ విజయవాడ ఆటోనగర్ డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు బెంగళూరు నుంచి విజయవాడకు వెళ్తోంది. కావలిలోని చేపల మార్కెట్ వద్ద ఆగి ఉన్న కారును చూసి డ్రైవర్ రామ్‌సింగ్ హారన్ కొట్టగా కారులోని నలుగురు వ్యక్తులు దిగివచ్చి అతడితో గొడవ పెట్టుకొని దాడి చేశారు. తర్వాత మరో రెండు కార్లలో వచ్చిన దుండగులు బస్సును అడ్డగించి డ్రైవర్ రామ్‌సింగ్‌ను కిందకు లాగి పడవేసి విచక్షణారహితంగా దాడి చేశారు. అడ్డు వచ్చిన సహ డ్రైవర్ శ్రీనివాసరావుపైనా దాడి చేసిన విషయం తెలిసిందే!. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనలో గత నెల 29న ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడైన దేవరకొండ సుధీర్ మాత్రం పట్టుబడలేదు. దీనిపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో పరారీలో ఉన్న సుధీర్‌ను చెన్నైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.